ఆంధ్రా ప్రీమియర్ లీగ్- మన ఆంధ్ర మన ఏపిఎల్ నూతన లోగో ఆవిష్కరణ
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిచనున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ తమ మూడవ ఎడిషన్ ను ” మన ఆంధ్ర మన ఏపిఎల్ ” నూతన లోగోను టోర్నమెంట్ ప్రదారాన్ని విశాఖపట్నం నకు చెందిన ఐపిఎల్ క్రీడాకారులు నితీష్ కుమార్ రెడ్డి (సన్ రైజెర్స్ హైదరాబాద్) , కే.ఎస్.భరత్ (కొలకత్తా నైట్ రైడస్), రికి బూయ (ఢిల్లీ కాపిటల్స్) చేతుల మీదుగా సోమవారం విశాఖపట్నంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాద్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో120 మంది క్రీడాకారులతో ఆరు జట్లు, 19 మ్యాచ్ లు నిర్వహిస్తున్నమన్నారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లను జూన్ 30వ తేదీ నుంచి జులై 13 వ తేదీ వరకు విశాఖపట్నం కడప నగరాలలో నిర్వహించుటకు సన్నాహాలు చేస్తున్నామని . ఆంధ్రా క్రీడాకారులు తమ క్రికెట్ నైపుణ్యత ను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించుకునేందుకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఒక చక్కటి వేదిక అని ఆయన అన్నరు. ఎపిఎల్ గత రెండు సీజన్ల అద్వితీయ విజయపరంపరతో, ఈ మూడవ ఎడిషన్ ఎపిఎల్ -2024 ను సరికొత్త లోగో మరియు నూతన ప్రధారంతో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నాము అన్నారు. వర్తమాన క్రీడాకారులు ప్రాంతీయ స్థాయి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పి ఎల్ ) జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించు అవకాశాలు కల్పించు లక్ష్యంతో ఉన్నామని అన్నారు. ఈ ఎపిఎల్ సీజన్-3 సరికొత్త రికార్డును సృష్టిస్తుందని, ప్రేక్షకులు క్రికెట్ ను చక్కగా ఆస్వాదిస్తారని భావిస్తున్నాను అన్నారు.
అంతేకాకుండా గత మే నెలలో నిర్వహించిన మినీ- వేలంలో 21 మంది రైజింగ్ స్టార్స్ తోకూడిన 451 మంది ఆటగాళ్ళ వేలం నిర్వహించారు. వీరిలో 7 గురు రైజింగ్ స్టార్స్ తోపాటు 120 మంది ఎంపిక అయ్యారు. బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్ కోస్టల్ రైడర్స్ ఈ ఆరు జట్లుపాల్గొంటున్నాయని , 12 కోట్ల వ్యయం తో నిరవహిస్తున్న ఈ టోర్నమెంట్ జూన్ 30 వ తేదీ నుంచి జరిగే ఎపిఎల్ సీజన్ 3లో పోటీపడతాయి. స్టార్ స్పోర్ట్స్ తెలుగు స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, ఫ్యాన్ కోడ్ లోఈ మ్యాచ్ లు అన్నీ ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు. అనంతరం ఐ పి ఎల్ తమ అనుభవాలను మీడియా వారితో పంచుకున్నారు.
ఈ మీడియా సమావేశంలో ఈ కార్యక్రమం లో ఎపిఎల్ పాలక మండలి సభ్యులు మాంకో ఫెర్రర్, , ఎపిఎల్ కోశాధికారి, ఏ.వి.చలం, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు జితేంద్ర నాద్ శర్మ, ఏసీఏవి సభ్యులు మురళీమోహన్, డి.ఆస్కార్ వినోద్, ఏసిఏ పిఆర్ఓ రాజ్ గోపాల్ పాల్గొన్నారు.