నాకు బ్రేక్ ఇచ్చే సినిమా లవ్ మౌళి
– ఏప్రిల్ 19 న విడుదల
– హీరో నవదీప్
విశాఖ పట్నం:
యంగ్ ట్యాలెంట్ హీరో *నవదీప్ హీరోగా*, *పంకురి గిద్వాని* హీరోయిన్ గా , *అవనింద్ర డైరెక్టర్* గా, సి స్పెస్, నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న *లవ్ మౌళి* చిత్ర ప్రమోషన్ లో భాగంగా మంగళ వారం ద్వారకా నగర్ లో గల శరత్ థియేటర్ లో చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. హీరో నవ దీప్ మాట్లాడుతూ, తాను విశాఖ రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఇక్కడ ఎన్నో చిత్రాల్లో షూటింగ్ లో పాల్గొన్నాను అని గుర్తు చేశారు. ఉగాది రోజున విశాఖ బీచ్ లో గడిపాను. ఇందులో నటించిన భావన విశాఖ అమ్మాయి అన్నారు. తాను ఎంతో ఇష్టం తో చేసిన సినిమా. మేఘాలయ లో 70 రోజుల పాటు కష్టపడి షూటింగ్ జరుపుకుంది అన్నారు. భావన కి తెలుగు లో ఇదే తొలి సినిమా అన్నారు. కథ విషయానికి వస్తె రియల్ లైఫ్ లో మారాలి అని పిల్లలకు ఇంట్లో పెద్దలు చెబితే గొడవలు వస్తాయి. ఈ పాయింట్ ఆధారంగా విజయేంద్ర ప్రసాద్ టీమ్ సభ్యుడు అవనింద్ర రాసిన, దర్శకత్వం వహించిన కథ అన్నారు. ఇది ప్రేమ మీద తీసిన కథ అయినా విభిన్న కథా చిత్రం అన్నారు. ఇది ట్రు లవ్ అంటే ఏమిటి అన్న కథాంశంగా సినిమా వుంటుంది అన్నారు. బ్రేక్ ఇస్తుంది అని తెలిపారు.
న్యూసెన్స్ 2 త్వరలోనే తీస్తాం అన్నారు. ప్రేమికులు మారాలి అనుకున్నపుడే గొడవలు వస్తాయి అన్నారు. ఈ సినిమాతో మరో లెక్క అని చమత్కరించారు. చిత్రం కథ చెప్పినపుడే ట్రూ లవ్ అంటే ఇదా అని తెలుసుకున్నాను. భీమిలి బీచ్ అందాలు ఆస్వాదించిన రోజులు వున్నాయి. సినిమాలో గడ్డం కోసం రెండేళ్లు పెంచాను అన్నారు. సినిమా ఈనెల 19 న విడుదల అవుతుంది అన్నారు.
హీరోయిన్ పంకురి గిద్వాని మాట్లాడుతూ, అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. షూటింగ్ బాగా ఎంజాయ్ చేశాం. అప్పుడే తెలుగు నేర్చుకున్నాను. చాలా కష్టపడి పని చేశాను అన్నారు. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అని పేర్కొన్నారు. తాను తెలుగులో నటించిన తొలి సినిమా అన్నారు. మేఘాలయ రాష్ట్రంలో షూటింగ్ సమయంలో తాము ఆర్మీ మాదిరిగా ఫీల్ అయ్యాం అన్నారు.
నటి
భావన మాట్లాడుతూ, తాను విశాఖ అమ్మాయిని ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని అన్నారు. చిత్రం టీజర్ విడుదల అయ్యాక మిగిలిన విషయాలు చెబుతాను అన్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రేక్షకులతో ముచ్చటించారు. ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.