బంగారు పిచ్చుకలను కాపాడుకుందాం- ప్రకృతి ఆధారిత పంటలకు ఉపకరించేది బంగారు పిచ్చుక

by vvwnews.com

బంగారు పిచ్చుకలను కాపాడుకుందాం
– ప్రకృతి ఆధారిత పంటలకు ఉపకరించేది బంగారు పిచ్చుక
– పరపరాగ సంపర్కంలో బంగారు పిచ్చుక స్థానం చాలా గొప్పది.
– ప్రతి ఒక్కరు స్పందించండి బంగారు పిచ్చుకలను కాపాడండి
– జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం
బంగారు పిచ్చుకలను కాపాడుకుందాం అని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. మంగళవారం మధ్యాహ్నం సబ్బవరం లో తాటి చెట్టు మీద వందలాదిగా గూళ్ళు పెట్టుకున్న బంగారు పిచ్చుకలను సిఫా ట్రస్ట్, గ్రీన్ క్లైమేట్ టీం లు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి ఆధారిత పంటలకు ఉపకరించేది బంగారు పిచ్చుక అన్నారు. పరపరాగ సంపర్కంలో బంగారు పిచ్చుక స్థానం చాలా గొప్పది అన్నారు. ప్రతి ఒక్కరు స్పందించండి బంగారు పిచ్చుకలను కాపాడండి అని కోరారు. రసాయన క్రిమి సంహారక మందులు, హైపవర్ టవర్ లైన్స్ నుండి విడుదల అవుతున్న ఎలక్ట్రో మేగ్నటిక్ వేవ్స్ వల్ల ఇవి అంతరించి పోతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు.
సిఫా ట్రస్ట్ సిఇఒ డాక్టర్ శసిప్రభ మాట్లాడుతూ అంతరిస్తున్న రైతు నేస్తం బంగారు పిచ్చుక అన్నారు. దీనిని కాపాడుకోవాల్సిన అవసరం అన్నం తినే ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. పంటలను ఆశించే క్రిమి, కీటకాలను ఆహారంగా తీసుకోవడం ద్వారా పంటలకు మేలు చేస్తుంది అన్నారు. అలాంటి బంగారు పిచ్చుకలు నివసించే ప్రాంతాలను ఎకో సెన్సిటివ్ ప్లేస్ లుగా పేర్కొంటూ ప్రభుత్వం వాటిని పరిరక్షించాలి అన్నారు. అంతరించిపోతున్న జాతికి చెందిన ఈ బంగారు పిచ్చుకను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఆమె వివరించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles