*సూపర్ సిక్స్ హామీలు అమలుచేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది – శ్రీ కె.కె రాజు గారు.*
ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ అనే కార్యక్రమం ప్రారంభోత్సవం అక్కయ్యపాలెం,షాదిఖాన కల్యాణ మండపంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె రాజు గారు ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్లమెంట్ పరిశీలకులు శ్రీ కదిరి బాబురావు గారు పాల్గొన్నారు.
👉ఈ సందర్భంగా శ్రీ కె.కె రాజు గారు మాట్లాడుతూ… ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు పాలనలో చోటుచేసుకుంటున్న అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కృషి చేయాలని అన్నారు త్వరలో ప్రతి వార్డులో “బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ” కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చంద్రబాబు పాలనలో జరిగిన మోసాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు.
👉2014లో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో పరిపాలనలో అనుభవం ఉందని చంద్రబాబు నాయుడుకి ప్రజలు అవకాశం కల్పిస్తే ప్రజలను మోసం చేసి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరించి పరిపాలించడంలో విఫలం చెందితే నాడు ప్రతిపక్ష నేతగా శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వంను ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయమని అనేక పోరాటాలు చేసిన నాటి ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రజలకు ధైర్యాన్ని నింపాలని వారికి భరోసాగా ఉండాలని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో 3648 కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి పాదయాత్రలో ప్రజలు దగ్గర నుండి వచ్చిన వినతులను స్వీకరించి వాటిని అధ్యాయనం చేసి ఆసమస్యలను పరిష్కారించడానికి ఎలాంటి పదకాలు తీసుకువస్తే రాష్ట్రంలో పేదరికం నిర్ములించగలుగుతాము అని నవరత్నాలు పథకాలు రూపొందించారని..అధికారం చేపట్టిన తరువాత ఇచ్చిన మాటమీద నిలబడి చెప్పినదానికంటే మిన్నగా చెప్పిన సమయం కన్నా ముందుగా ప్రతి సంక్షేమ పధకం కూడా అమలు చేసారని అన్నారు.
👉గత ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన,బిజెపి, పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్ పేరుతో అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలందరినీ నమ్మించి,మోసగించి, అధికారంలోకి వచ్చిందని ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రానికి కష్టాలను తెచ్చే విధంగా ప్రతి అంశంలో వివక్ష చూపిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రశ్నించే ప్రతి గొంతుకును నొక్కే ప్రయత్నం చేస్తూ తప్పుడు కేసులతో అరాచకాలతో ఈరోజు రాష్ట్రంలో శాంతిభద్రతలకు వికటం కలిగిస్తూ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో కూటమి ప్రభుత్వం నూటికి నూరు శాతం విఫలం చెందిందని మండిపడ్డారు..
👉2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సారధ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదర్శంగా నిలిస్తే.. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా కళ్ళబొల్లు కబుర్లు చెబుతూ పరిపాలన చేయడం లో విఫలం చెంది నిస్సిగ్గుగా సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా అమలు అయిపోయాయని వారికున్న ప్రచార మాధ్యమాలు ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
👉*కదిరి బాబురావు మాట్లాడుతూ …*
చంద్ర బాబు మోసగాడు అని ఇప్పుడు మన కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 20 సంవత్సరాలు అందరికి తెలుసు ఎప్పుడైతే ఎన్.టి.రామారావు గారికి వెన్ను పోటు పొడిచి అధికారం లోకి వచ్చాడో అప్పుడు నుంచి కూడా ఆయన మాటకు షూరిటీ లేదు గ్యారెంటీ లేదు ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ లో ఉన్నప్పుడు నాకు MLA టికెట్ ఇస్తాను అని చివరి వరకు ఇవ్వకుండా చివరలో వేరే నియోజకవర్గం లోకి వెళ్ళమని అనేక రకములుగా నన్ను మోసం చేసి అనేక రకములుగా ఇబ్బంది పెట్టేవాడు ఇంకా అక్కడ ఉండ లేక జగన్ గారితో మాటలాడి వైసీపీ లోకి రావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే మరలా జగన్ గారు సీఎం ఆవవలిసిన అవసరం ఎంతయున ఉంది కాబట్టి వైసీపీ సైన్యం అంత కలిసి కట్టుగా పని చేయాలని అన్నారు అదే విధముగా కె. కె.రాజు బాగా కష్టపడే నాయకుడు దురదృష్టం కొద్దీ ఆయన రెండుసార్లు ఓటమి చెందారు ఆయన సరే వెనకంజ వేయకుండా పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్నాడు ఇలాంటి వ్యక్తి నీ మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని దీనికోసం ప్రతి ఒక్కరూ కస్టపడి పని చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ కుమార్,రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాధం,మాజీ వుడా చైర్మన్ రవిరాజు గారు,డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు,కార్పొరేటర్లు కె.అనిల్ కుమార్ రాజు,సాడి పద్మారెడ్డి,వావిలపల్లి ప్రసాద్,రెయ్యి వెంకటరమణ,బర్కత్ అలీ,కె.వి.యన్ శశికళ,సేనాపతి అప్పారావు,పేడాడ రమణికుమారి,బొగ్గు శ్రీను,మాజీ కార్పొరేటర్లు జి.వి రమణి,పామోటి బాబ్జి,దల్లి రామకృష్ణ రెడ్డి,వార్డు అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి,పైడి రమణ,పీలా వెంకటలక్ష్మీ,నీలి రవి,బలిరెడ్డి గోవింద్,సుకుమార్,ఐ.రవి కుమార్,బల్లా శ్రీనివాస్,గుడ్ల అశోక్ కుమార్ రెడ్డి,బొడ్డెటి కిరణ్,బీశెట్టి ప్రసాద్,వేణు,విశాఖ ఉత్తర నియోజకవర్గ రాష్ట్ర,జిల్లా నాయకులు,జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు,సీనియర్ నాయకులు,మాజీ డైరెక్టర్లు,నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు,బూత్ కన్వీనర్లు&సభ్యులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.