క్యాన్సర్ ఎదుర్కో వడానికి, రోగులో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి అపోలో హాస్పిటల్ “కెన్ విన్”

by vvwnews.com

క్యాన్సర్ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కో వడానికి, రోగులో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి అపోలో ఆసుపత్రి యాజమాన్యం’ కెన్ విన్- పేరుతో ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈనెల క్యాన్సర్ విజేతల మాస ఉత్సవాన్ని ( క్యాన్సర్ సర్వేపర్సు మంత్ పురస్కరించుకొని చిరునవ్వుతో క్యాన్సర్ జయించాలి- అనే లక్ష్యంతో కెన్ విన్ ‘గ్రూప్ బుధవారం ఆరిలోవ క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అపోలో వైద్య బృందం మాట్లాడుతూ కేవలం వైద్యంతోనే కాకుండా క్యాన్సర్ వ్యాధిగ్రసులో వ్యాధి పట అవగాహన, వారిలో ఆత్మ సర్వాన్ని పెంపొందించడంతో రోగ నివారణ సులభతరం అవుతుందన్నారు. ఈ కారణంగా అపోలో క్యాన్సర్ వైద్య బృందం క్యాన్నర్ వ్యాధిని జయించిన విజేతలతో కెస్ విన్ అనే వాట్సప్ గ్రూపును ప్రారంభించింది అన్నారు. ఈ గూపులో చేరిన వారు క్యాన్సర్ వ్యాధి పట ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు ఉచితంగా వైద్య సలహాలు, వైద్యులతో సంప్రదింపులు జరపడం, క్యాన్సర్ విజేతల అనుభవాలను తెలుసుకోవడం వీలు పడుతుందన్నారు. ఇంతవరకు ఎవరు ప్రారంభించిన ఈ వినూత.

కార్యక్రమాన్ని అపోలో ఆసుపత్రి ప్రారంభించడం హర్షదాయకమన్నారు

క్యాన్సర్ చికిత్సలో ఉన్నవారు, క్యాన్సర్ వ్యాధి పట్ల అనుమానితులు, క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడిన వారు కూడా ఈ గ్రూపు ఉచితంగా చేరి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అన్నారు. ‘కెన్ విన్ అనే ఇంగ్లీష్ పదంలో కెన్ పదం క్యాన్సర్ మొదట మూడు అక్షరాలను సూచిస్తుందని, అలాగే విన్ అనే పదం విజయాన్ని సూచిస్తుందని వైద్యులు వివరించారు. ఈ గ్రూపులో చేరాలనుకునేవారు క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా, నేరుగా ఆసుపత్రిని గాని, లేదా 0891-2727272,0891-2867777 ఫోన్ కి సంప్రదించాలని కోరారు.ఈ ఈ కార్యక్రమంలో అపోలో క్యాన్సర్ ఆస్పత్రిలో వైద్యం పొంది క్యాన్సర్ జయించిన విజేతలు గాయత్రి కృష్ణ, రామ్మోహన్ రావు, సాత్విక్ రామ్ తమ అనుభవాలను వెల్లడించి, అపోలో ఆన్కాలజీ వైద్యులు సేవలను కొనియాడారు.

ఈ విలేకరుల కార్యక్రమంలో అపోలో క్యాన్సర్ ఆస్పత్రి ఆన్కాలజీ వైద్యులు డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ వి ప్రదీప్, డాక్టర్ సుమన్ దాస్, యూనిట్ హెడ్ డాక్టర్ బ్రహ్మాజీ నాయుడు మాట్లాడారు.

Use Social Media to Spread the Word about Our News

related articles