ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి పిచ్చుకల కోసం గూళ్ళు ఏర్పాటు చేయాలి

by vvwnews.com

ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి
– పిచ్చుకల కోసం గూళ్ళు ఏర్పాటు చేయాలి
– పక్షుల కోసం ధాన్యపు కంకులు కుచ్చులు ఏర్పాటు చేయాలి
ఔషధ, పండ్లు, పక్షులు గూళ్ళు పెట్టుకునే మొక్కలు నాటి పెంచాలి
– జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ
ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కురుప్రోలు జూనియర్ కళాశాల లో మంగళవారం ఉదయం గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ నేతృత్వంలో మొక్కలు నాటడం, పిచ్చుకల కోసం గూళ్ళు ఏర్పాటు, ధాన్యం కంకుల కుచ్చులు ఏర్పాటు చేసిన అనంతరం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పిచ్చుకల కోసం గూళ్ళు ఏర్పాటు చేయాలన్నారు. ఔషధ గుణాలు కలిగిన, పండ్లు జాతి, పక్షులు గూళ్ళు పెట్టుకునే మొక్కలు నాటి పెంచాలని కోరారు.
జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె ప్రసాద్ మాట్లాడుతూ తమ విద్యార్థులకు చదువు తో పాటు సంస్కారం, ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరంగా ఒక ఆక్సిజన్ హబ్ వలె తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్ళారు. ఇందుకు ఇటు అధ్యాపకులు, అటు విద్యార్థులు సహకరిస్తున్నారని, వారందరికీ అభినందనలు తెలియజేశారు.
ఇంగ్లీష్ లెక్చరర్ ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ తమ సంస్థను అన్ని రకాలుగా ముందుకు తీసుకు వెళ్లడానికి సమిష్టిగా కృషి చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles