ఐసీఐసీఐ, టీఎంసీ ఆధ్వర్యంలో విశాఖ లో అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ కేర్ బ్లాక్
రూ. 550 కోట్లతో నిర్మాణం
విశాఖపట్నం:
టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) తో కలిసి విశాఖపట్నంలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (హెచ్ బీసీ హెచ్ఆర్ సీ)లో కొత్త భవంతి నిర్మాణ పనులను ఐసీఐసీఐ బ్యాంక్ ప్రారంభించింది.
ఈ మేరకు గురువారం ఆ ఆసుపత్రి ప్రాంగణంలో
నూతన భవనానికి శంకుస్థాపన చేశారు.
ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా, టాటా మెమోరియల్ సెంటర్ (ముంబై) డైరెక్టర్ డాక్టర్ సుదీప్ గుప్తా సమక్షంలో ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్ కుమార్ సిన్హా కొత్త భవనం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఇతర ప్రముఖుల సమక్షంలో ఎన్.కె . రావు ఆడిటోరియంను కూడా సిన్హా ప్రారంభించారు. కొత్త ఆడిటోరియంనకు మౌలిక సదుపాయాలు, ఎక్విప్‌మెంట్‌పరంగా టీఎంసీ కి ఐసీఐసీఐ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించింది.
ఈ సందర్భంగా
ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్ కుమార్ సిన్హా
మాట్లాడుతూ
సుమారు 3.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అత్యుత్తమ మెడికల్ టెక్నాలజీతో ఏర్పాటయ్యే ఈ అధునాతన కేంద్రం నిర్మాణానికి రూ. 550 కోట్ల పైగా మొత్తానికి కమిట్‌మెంట్‌తో ఐసీఐసీఐ బ్యాంకు నిధులను సమకూరుస్తోందన్నారు.
ఎనిమిది అంతస్తుల ఐసీఐసీఐ ఫౌండేషన్ బ్లాక్ ఫర్ చైల్డ్ అండ్ బ్లడ్ క్యాన్సర్ కొత్త బిల్డింగ్ అందుబాటులోకి వచ్చాక ఏటా 3,000 మంది పేషంట్లకు సేవలందించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ప్రస్తుతం
హెచ్ బీసీ హెచ్ఆర్ సీ లో
వార్షిక సామర్థ్యం 6,200 పేషంట్లుగా ఉందని,
తూర్పు భారతదేశంలోనే అత్యుత్తమ స్పెషలైజ్డ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాల్లో ఒకటిగా నిల్చేలా రూపొందిస్తున్న ఈ కొత్త భవనంలో 215 పైగా పడకలు ఉంటాయన్నారు. . అన్ని అనుమతులకు లోబడి 2027 నాటికి ఇది పూర్తవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ సీఎస్ఆర్ విభాగమైన ఐసీఐసీఐ ఫౌండేషన్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ దీన్ని అమలును పర్యవేక్షిస్తుందని చెప్పారు.
దేశీయంగా కీలక ఆరోగ్యసంరక్షణ మౌలిక సదుపాయాలను పటిష్టపర్చాలన్న లక్ష్యానికి అనుగుణంగా క్యాన్సర్ కేర్ విషయంలో ఐసిఐసిఐ, టిఎంసి కలిసి ముందుకు తీసుకు వస్తున్న ఈ ప్రాజెక్టు
అవసరార్ధులకు అత్యంత నాణ్యమైన వైద్య సంరక్షణను అందుబాటులోకి తేవాలన్న తమ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. తూర్పు కారిడార్‌లో శిశు మరియు రక్త క్యాన్సర్‌కి సంబంధించి అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటిగా ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్, సమీపాన ఉన్న తూర్పు రాష్ట్రాల్లోని పేషంట్లకు సేవలందించేందుకు ఉపయోగపడుతుందని, పెరుగుతున్న క్యాన్సర్ చికిత్స అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది” అని చెప్పారు.
“సీఎస్ఆర్ కార్యకలాపాలకు సంబంధించి ఆరోగ్య సంరక్షణపై ఐసీఐసీఐ బ్యాంక్ ప్రత్యేక దృష్టి పెడుతుందని, విశాఖపట్నం, నవీ ముంబై, న్యూ చండీగఢ్‌లో కొత్తగా మూడు టిఎంసి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రూ. 1,200 కోట్లు హామీనివ్వడం ద్వారా భారత్‌లో క్యాన్సర్ కేర్‌కి సంబంధించి విశిష్ట సేవలు అందిస్తున్న టీఎంసీతో కలిసి పనిచేస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా తెలిపారు.
ప్రాంతీయంగా పీడియాట్రిక్, హెమటోలింఫాయిడ్ క్యాన్సర్ల చికిత్స మరియు పరిశోధన పురోగతికి ఇది గణనీయంగా దోహదపడుతుందని, దేశవ్యాప్తంగా క్యాన్సర్ పేషంట్లకు అత్యుత్తమ చికిత్సను అందించేందుకు, మెరుగైన ఫలితాలను సాధించేందుకు మా సంస్థలు సమిష్టిగా చేస్తున్న కృషికి ఐసీఐసీఐ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం నిదర్శనంగా నిలుస్తుంది” అని విశాఖపట్నంలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ మహంత్‌శెట్టి తెలిపారు.