ఫ్రెష్ బస్ వారి ఎలక్ట్రిక్ బస్ సర్వీసు ప్రారంభం భారతదేశంలో ఎలక్ట్రిక్ ఇంటర్ సిటీ బస్సు సర్వీసులలో

by vvwnews.com

ఫ్రెష్ బస్ వారి ఎలక్ట్రిక్ బస్ సర్వీసు ప్రారంభం
విశాఖపట్నం 9 జూన్ 2025 : భారతదేశంలో ఎలక్ట్రిక్ ఇంటర్ సిటీ బస్సు సర్వీసులలో ప్రముఖ సంస్థ ఫ్రెష్ బస్ వారు ఈరోజు విశాఖపట్నం -విజయవాడ & గుంటూరు నగరాల మధ్యన తమ కొత్త ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించారు. ఈ బస్సు సర్వీసు అత్యాధునిక అన్ని హంగులు మరియు ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయాలను కలిగి ఉన్నది. పర్యావరణ పరిరక్షణ దిశగా ఇంధన కాలుష్యం నివారించే లక్ష్యంతో ఈ ఎలక్ట్రిక్ బస్సు ప్రవేశ పెట్టినట్లు ఫ్రెష్ బస్ వారు చెప్పారు. ఈ బస్సు విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు వెళుతుందని మిడ్ పాయింట్ రాజమండ్రి వద్ద ఆగుతుందని చెప్పారు.
ఇంధన కాలుష్య రహితంగా డీజిల్ కు ప్రత్యామ్నయంగా హరితదనం వెళ్లివిరిసే ఆలోచనతో ఈ ఎలక్ట్రిక్ బస్సును ప్రవేశపెట్టటం ఫ్రెష్ బస్ వారి లక్ష్యానికి మరో మైలురాయి. ఈ బస్సు ప్రయాణం టికెట్ ఆన్ లైన్ బుకింగ్ దగ్గర నుంచి వారు తమ గమ్యస్థానం చేరే వరకు ఒక గొప్ప ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది. ప్రయాణికులకు సంపూర్ణమైన భద్రతను చేకూర్చటమే కాక పరిశుభ్రత మరియు ప్రశాంతత ప్రాధాన్యతతో బస్సు ప్రయాణం సాగుతుంది. బస్సులో సువిశాలమైన సీట్లు చక్కగా విశ్రాంతిగా కూర్చోవటానికి అనువైన సీటింగ్ ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. ప్రయాణికులకు ఉచిత స్నాక్స్ మరియు పానీయాలు అందించటమే కాక శిక్షణ పొందిన ఫ్రెష్ బస్ కెప్టెన్స్ మర్యాద పూర్వకమైన సేవలను అందిస్తారు. ఈ బస్సు ప్రయాణికులు తాజాగా మరియు వేడిగా రుచికరమైన భోజనం కూడ ఆస్వాదించ వచ్చును. విశాఖపట్నం -విజయవాడ & గుంటూరు ప్రయాణ మార్గం ప్రయాణికులకు విశ్వసనీయమైన మరియు ఇంటర్ సిటీ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభించిన సందర్భంగా ఫ్రెష్ బస్ వ్యవస్థాపకులు మరియు ముఖ్య కార్య నిర్వాహణాదికారి అయిన శ్రీ సుధాకర్ చిర్రా మాట్లాడుతూ భారత దేశంలోని నగరాల మధ్యన ప్రయాణాల పరిస్థితులను మధురానుభూతిగా మార్చే లక్ష్యంతో అత్యంత శక్తివంతంగా ఫ్రెష్ బస్ సంస్థ పనిచేస్తుంది అన్నారు. కేవలం ప్రయాణికలను వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చటమే కాక ఈ ప్రయాణంలో వారికి మంచి అనుభవం కలిగించాలనే లక్ష్యంతో అనేక సదుపాయాలను అందిస్తూ ఈ బస్సులను నడుపుతున్నాము అన్నారు. భారతదేశం అంతటా హరితదనం వెళ్లివిరిసేలాగా ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతూ ముందుకు సాగుతున్నాము అని చెప్పారు.
విశాఖపట్నం – విజయవాడ & గుంటూరు మధ్య నూతన ఎలక్ట్రిక్ బస్ ప్రారంభం సందర్భంగా వెర్టేలో ఎలక్ట్రిక్ మోటారు వాహానాల సరఫరా సంస్థ ముఖ్య కార్య నిర్వాహణాధికారి శ్రీ సందీప్ గంభీర్ మాట్లాడుతూ ఈ నూతన మార్గంలో ఫ్రెష్ బస్ వారు ఎలక్ట్రిక్ బస్ ఆవిష్కరించటం మాకు చాల సంతోషంగాను మరియు ఉత్సాహంగాను ఉంది అన్నారు. మేము ఫ్రెష్ బస్ వారితో చేసుకున్న ఒప్పందానికి ఇది నాంది పలికినది. ఫ్రెష్ బస్ వారు త్వరలోనే భారతదేశం అంతటా అనేక మార్గాలలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టటం మనం చూస్తాము. మా వెర్టేలో వాహన ఎలక్ట్రిఫికేషన్ లో నిమగ్నమైన సంస్థ మరియు ఇటీవలే ఫ్రెష్ బస్ వారితో కలసి పనిచేస్తున్నామని శ్రీ సందీప్ తెలిపారు. హరితదనం వెళ్లివిరిసేలా మరియు సుస్థిరమైన రవాణా ల్యాండ్ స్కేప్ సాధించాలనే లక్ష్యంతో కలసి పనిచేస్తున్నాము అన్నారు. ఫ్రెష్ బస్ వారి శక్తి సామర్థ్యాలు మరియు వారి లక్ష్యాలకు మేము ఎంతో సంతోషిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నాము. ఈ నూతన ఎలక్ట్రిక్ బస్ ఆవిష్కరణ మా ఇరువురి లక్ష్య సాధనకు వారి నిబద్దతకు నిదర్శనం అన్నారు.
ఫ్రెష్ బస్ సుస్థిరమైన సేవలను అందిస్తుంది. 98% ఖాతాదారుల కాల్స్ కు కేవలం 30 సెకండ్లలో సమాధానం ఇస్తుంది. మహిళా ప్రయాణికులు కొరకు 24/7 మహిళా హెల్ప్ లైను సౌకర్యం కూడ ఫ్రెష్ బస్ ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ప్రతి బస్సు ప్రయాణం ఒక అద్భుతంగా మంచి విలువలతో సాగాలనే ఆలోచనలతో ప్రయాణికులకు లాయల్టీ అందిస్తున్నాది. ప్రతి వంద కిలోమీటర్ల ప్రయాణానికి 10 గ్రీన్ కాయిన్స్ అందిస్తున్నాది. ప్రయాణికులు వీటిని తమ తదుపరి ప్రయాణ టిక్కెట్ల కొనుగోలు సమయంలో ఉపయోగించవచ్చును. విశాఖపట్నం-విజయవాడ & గుంటూరు మరియు ఇతర ఫ్రెష్ బస్ రూట్ల టిక్కెట్లు freshbus.com లేదా ఫ్రెష్ బస్ యాప్ లో అందుబాటులో ఉంటాయి. తరచుగా ప్రయాణించే వారు 10 రైడ్ లలో ఒక్కో రైడ్ కు రూ.50/- ఆదా చేసుకోవడానికి ఫ్రెష్ కార్డును కొనుగోలు చేయవచ్చునని ఈ కార్డు ఆరు నెలలు పాటు చెల్లుబాటులో ఉంటుందని వివరించారు

Use Social Media to Spread the Word about Our News

related articles