MALABAR GOLD VISAKHAPATNAM “70000 HUNGAR FREE”రోజుకి 70 వేల మందికి భోజనం సప్లయ్ చేస్తున్నారు

by vvwnews.com

2025 2026 సంవత్సరంలో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడానికి రూ.150 కోట్లు కేటాయించిన మలబార్ గ్రూప్.

‘వరల్డ్ హంగర్ డే’ సందర్భంగా, భారతదేశం మరియు జాంబియా దేశాల్లో ప్రతిరోజూ 70,000 భోజనాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది, మలబార్ ‘హంగర్ ఫ్రీ వరల్డ్’ పథకంలో భాగంగా 2025-26 సంవత్సరంలో మొత్తం 250 కోట్ల భోజనాలు ఉచితంగా అందించాలని నిర్ణయించారు.

‘హంగర్ ఫ్రీ వరల్డ్’ పథకం ప్రారంభించినప్పటి నుండి, గత 3 ఏళ్లలో. 25 కోట్ల భోజనాలు నిరుపేదలకు అందించబడ్డాయి.

తమ వార్షిక సి.ఎస్.ఆర్ బడ్జెట్లో 60 శాతం నిధులను, నిరుపేదల ఆకలి తీర్చడం మరియు పేదరికాన్ని నిర్మూలించడానికి ఉద్దేశించిన కార్యక్రమాల కోసం మలబార్ గ్రూప్ కేటాయించింది. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మంచి చేయాలనే మలబార్ గ్రూపు నిబద్ధతను బలోపేతం చేస్తుంది..

200000, మే 28, 2025: భారతదేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థ మరియు మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క మాతృ సంస్థ అయిన మలబార్ గ్రూప్ తమ సి. ఎస్.ఆర్ కార్యక్రమాల కోసం 2025-26 సంవత్సరానికి గాను రూ.150 కోట్లు కేటాయించింది. ఆరోగ్య సంరక్షణ, విద్య ఆకలి తీర్చడం & పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ మరియు పేదలకు గృహ నిర్మాణం వంటి అంశాల్లో తమ సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుంది.

తమ ప్రధాన సామాజిక సేవ కార్యక్రమం ‘ది హంగర్ ఫ్రీ వరల్డ్’ కింద, భారతదేశం మరియు జాంబియా దేశాల్లోని నిరుపేదలకు, ప్రతిరోజు 70,000 భోజనాలు పంపిణీ చేయడానికి మలబార్ గ్రూప్ నిర్ణయించింది, 2025-26 సంవత్సరంలో మొత్తం 250 కోట్ల భోజనాలు అందించబడతాయి. గత 3 సంవత్సరాలలో మొత్తం 25 కోట్ల భోజనాలు అందించగా, కేవలం ఈ ఏడాదిలోనే అన్ని భోజనాలు అందించాలనే నిర్ణయం గణనీయమైన పురోగతిని సూచిస్తుంది మరియు నిరుపేదలకు ఆహార భద్రత. కల్పించడం పట్ల మలబార్ గ్రూప్ యొక్క బలమైన నిబద్ధతను సూచిస్తుంది. ఈ చొరవ ఐక్యరాజ్యసమితి యొక్క ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యం 2-జీరో హంగర్ (Sustainable Development Goal 2-Zero Hunger) తో అనుసంధానించబడింది.

2025 మే 28వ తేదీ నాడు న్యూఢిల్లీ, జనపథ్ లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో, ‘వరల్డ్ హంగర్ డే’ని కూడా గుర్తు చేసుకుంటూ, నీతి ఆయోగ్ మాజీ సిఇఒ & జి-20 షెర్పా డాక్టర్ అమితాబ్ కాంత్ మలబార్ గ్రూప్ యొక్క తదుపరి దశ సిఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ శ్రీ ఎం.పి.అహ్మద్; మలబార్ గ్రూప్ వైస్ చైర్మన్ శ్రీ కె.పి. అబ్దుల్ సలాం: మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఓ. ఆషర్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

‘హంగర్ ఫ్రీ వరల్డ్’ పథకం గురించి వ్యాఖ్యానిస్తూ, మలబార్ గ్రూప్ చైర్మన్ శ్రీ ఎం.పి.అహ్మద్ మాట్లాడుతూ, “మలబార్ గ్రూప్ , సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ అనేది మా సంస్కృతిలో అంతర్భాగం, అంతేకాదు మా సంపాదనలో కొంతభాగాన్ని తిరిగి సమాజానికి ఇవ్వడాన్ని మేము నమ్ముతాము. ఇకపై, మే 28వ తేదీని మా వార్షిక సి.ఎస్.ఆర్ దినోత్సవంగా నిర్ణయిస్తున్నాము: స్థిరమైన మరియు ప్రభావవంతమైన చర్యల ద్వారా పేదలకు అండగా నిలబడతామని మా ప్రతిజ్ఞను పునరుద్ఘాటిస్తున్నాము. మేము చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు మా శాశ్వత నిబద్ధతకు ప్రతిబింబం. మా వంతు కృషి మేము చేస్తున్నప్పుడు, ఈ మిషన్లో మరికొన్ని సంస్థలు చేరితే అధిక ప్రభావాన్ని సాధించవచ్చు. ఐక్యరాజ్య సమితి డేటా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 295 మిలియన్ల మంది తీవ్రమైన ఆకలితో బాధపడుతున్నారని తెలుస్తోంది, దీనిపై తక్షణ చర్య ఎంతో అవసరం. ఈ ఆవశ్యకతే ‘హంగర్ ఫ్రీ వరల్డ్’ పథకం కింద మేము నిర్వహిస్తున్న భోజన పంపిణీ ప్రయత్నాలను నడిపిస్తుంది. ఆహార పంపిణీతో పాటు, సుస్థిరమైన మార్పును సాధించే దిశగా ఉత్పత్తిని పెంచడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి సమిష్టి ప్రయత్నాలు ఈ సమయంలో ఎంతో అవసరం.” అన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles