స్టీల్ ప్లాంట్ లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి AITUC డిమాండ్

by vvwnews.com

ప్రెస్ నోట్ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి జి వామనమూర్తి డిమాండ్ స్టీల్ ప్లాంట్లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లో తీసుకోవాలని బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తేదీ 24-5-2025 ఉదయం 10 గంటలకి ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్ గేట్ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీరాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామన మూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని తొలగించిన రెండు వేల మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికుల వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బకాయి పడిన జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని హామీలు ఇచ్చి అధికారులకు వచ్చిన తర్వాత నరేంద్రమోడీ కాళ్లు మొక్కుతున్నారని మండిపడ్డారు ఎన్నికల ముందు విశాఖ స్టీల్ కాపాడుతామని చెప్పిన రాజకీయ నాయకులు ఏరు దాటే వరకు ఏరు మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడు మల్లన్న అన్న సామెతను అమలు చేస్తున్నారని విమర్శించారు రాష్ట్రానికే అతి పెద్ద పరిశ్రమ అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల విధుల్లోకి తీసుకోవాలని జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కార్మిక ఉద్యోగుల పోరాటానికి మద్దతుగా ఈరోజు ఆటో కార్మికులు నిరసన ధర్నా చేపట్టారని ప్రభుత్వానికి తెలియచేశారు

స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు

Use Social Media to Spread the Word about Our News

related articles