*ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డుకై, జిఓ నెం.21 ఉపసంహరణకై పెంచిన త్రైమాసిక, ఆర్టీఓ చలానా చార్జీలు తగ్గించాలని లేబర్ కోడ్స్ రద్దు చేయాలని దేశవ్యాప్త ఆటోబంద్ ను జయప్రదం చెయ్యండి.*
జగదాంబ సిఐటియు ఆఫీసులో ఆటో రిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రెస్మీట్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది
ముఖ్య వత్తుగా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్ వి కుమార్ గారు మాట్లాడుతూ
దేశవ్యాప్తంగా సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు జరిగిన సమ్మెలకు ఇప్పుడు జరుగుతున్న ఈ సమ్మె (మే`20)కు చాలా వ్యత్యాసం ఉంది.16 డిమాండ్లులో
అన్నింటకన్నా ముఖ్యమైనది లేబర్‌కోడ్‌లను రద్దు చేయడం. లేబర్‌కోడ్‌లు అమలులోకి వస్తే చట్టాలు వర్తించే కార్మికులు, చట్టాలువర్తించని (షెడ్యూల్, నాన్ షెడ్యూల్) కార్మికులు అందరూ బానిసత్వంలోకి నెట్టబడతారు. వీటితో పాటు ఆటో కార్మికులకు ఉరితాడు వంటి మోటారు ట్రాన్స్‌పోర్టు సవరణ చట్టం 2019ను రద్దు చేయాలని పెంచిన చలానా చార్జీలు తగ్గించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ 11 కేంద్ర కార్మిక సంఘాలు మే 20వ తేదీన ఆటోబంద్‌కు పిలుపు ఇచ్చాయి. కార్మికులందరూ ఈ బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
లేబర్‌కోడ్‌లు అమలులోకి వస్తే సంఘం పెట్టుకునే హక్కు పోతుంది. అన్నింటికంటే ప్రమాదకరమైంది లేబర్‌కోడ్‌లో సమ్మె హక్కును కాజేయడం. యూనియన్ రిజిస్ట్రేషన్, గుర్తింపు రెండూ రద్దుచేయవచ్చు. లక్షలు జరిమానా విధించవచ్చు.
కాని ఇప్పటి వరకూ యజమానులు పిఎఫ్, ఇఎస్‌ఐ, బోనస్ చెల్లించని వారికి జైలుశిక్ష ఉండేది, దానికి భయపడి కట్టేవారు.బెయిల్ రావాలంటే కూడా 50% చెల్లించాలి. కాని లేబర్ కోడ్‌లో యజమానులపై ఈ శిక్షలన్నీ ఎత్తివేశారు. ఇవే కాకుండా ఇతర కార్మిక చట్టాలు, క్రిమినల్ చట్టాల్లో వున్న 180 రకాలు శిక్షలు ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం ‘జన విశ్వాస్’ అనే చట్టంచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనిఖీలు పద్దతిని ఎత్తివేశారు. తనిఖీలు లేకుండా ఏ చట్టం అమలుకాదు. లేబర్‌కోడ్‌లు కంపెనీలు మూసివేయడం, లాకౌట్‌చేయడం, లేఆఫ్ చేయడానికి పార్లమెంట్ లోనే మార్చాలి. కాని లేబర్‌కోడ్‌లద్వారా రాష్ట్రాలకు ఇష్టంవచ్చినట్లు మార్చే అధికారాలొచ్చాయి.రాష్ట్రంలో లేబర్‌కోడ్‌లు రాకుండానే చంద్రబాబునాయుడు ప్రభుత్వం ‘స్పీడ్‌ఆఫ్ డూయింగ్’ అమలు చేస్తున్నది. సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు కనీస వేతనాలు రూపాయి కూడా పెంచలేదు. లేబర్‌కోడ్‌లు వస్తే ఇప్పుడున్న అన్ని చట్టాలు పోయినట్లే.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన ఆటో రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. చలానా చార్జీలు, థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్, పెట్రోల్, డీజిల్ చార్జీలు విపరీతంగా పెంచారు. రాష్ట్రంలో జిఓ నెం.21 పేరుతో ఆటో, ట్యాక్సీ, లారీ లపై భారాలు వేశారు. ఎన్నికల ముందు లోకేష్ గారు ప్రతి స్టాండ్‌కి వచ్చి ఇచ్చిన హామీ ప్రకారం కార్మికుల్ని ఆదుకోవటానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు గురించి పట్టించుకోవటంలేదు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి కార్పొరేట్ కంపెనీలకు రవాణా రంగం అనుమతి ఇవ్వడంతో ఆటో, ట్యాక్సీ రంగంలో ఉపాధి పొందుతున్న వారి జీవితాలు దిన దిన గండంగా మారాయి. పనిగంటలు, కనీస వేతనాలు, ఇఎస్‌ఐ, పిఎఫ్, ప్రమాధబీమా, రెస్ట్ రూమ్‌లు వంటి కనీస వసతులు లేవు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన స్పందన లేని పరిస్థితుల్లో 11 కేంద్ర కార్మిక సంఘాలు మే 20 వ తేదీన ఇచ్చిన సమ్మె పిలుపులో ఆటో, ట్యాక్సీ, డ్రైవర్ కం ఓనర్లు అందరూ పాల్గొని జయప్రదం చెయ్యవల్సిందిగా కోరారు.
డిమాండ్స్
1) 4 లేబర్ కోడ్లను ఉపసంహరించాలి.
2) ఆటో రంగ కార్మికులకు పి.ఎఫ్., ఇఎస్‌ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలి.
3) ఉబర్,ఓలా,రాపిడో, వంటి కార్పొరేట్ కంపెనీలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘యాప్’ ను అభివృద్ధి చేసి 6% కమీషన్ తో నిర్వహిచాలి.
4) ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీ తో కూడిన లోన్లు మంజూరుచేసి కొత్త వాహనాలు ఇప్పించాలి.
5) డీజిల్,పెట్రోల్ పన్నులు మినహాయించి, ధరలు తగ్గించాలి.
వాహన రిపేరు విడిబాగాల పై టాక్స్‌లు తగ్గించాలి.
6) డ్రైవర్లుకు ఉరితాడు వంటి మోటారు ట్రాన్స్‌పోర్టు సవరణ చట్టం 2019, జి.ఓ.నెం. 21ను రద్దు చేయాలి.
ఈ కార్యక్రమంలో ఆటో రిక్షా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ జిల్లా నాయకులు రెడ్డి గారు కె వి రమణ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
పి రాజ్ కుమార్
విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం