ప్రజాభవన్లో మంత్రి సీతక్కతో భేటీ అయిన భారత్ బచావో సంస్థ ప్రతినిధులు

by vvwnews.com

*ప్రజాభవన్లో మంత్రి సీతక్కతో భేటీ అయిన భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్ ఎమ్ ఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేష్ బాబు*

ఆపరేషన్ కగార్ ను నిలిపివేసేలా తన వంతు ప్రయత్నం చేయాలని మంత్రి సీతక్కను విజ్ఞప్తి చేసిన ప్రతినిధులు

తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దు కర్రెగుటల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని మంత్రి సీతక్కను కోరిన ప్రతినిధులు

వేల సంఖ్యలో కేంద్ర బలగాలు కర్రెగుట్ట ప్రాంతాల్లో సంచరిస్తున్నటంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని మంత్రికి తెలిపిన ప్రతినిధులు

ఆపరేషన్ కగారును తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్న ప్రతినిధులు

ఆపరేషన్ కగారు నివారణకు కృషి చేయాలని మంత్రి సీతక్కను విజ్ఞప్తి చేసిన ప్రతినిధులు

*సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క*

*మంత్రి సీతక్క*

ఆదివాసీల ప్రయోజనాల దృష్టిలో ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలి

శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యం గా ఉండాలి

తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలి

మధ్యభారతంలోని ఆదివాసి ప్రాంతాలు రాజ్యాంగం లోని షెడ్యూల్ 5 పరిధిలోకి వస్తాయి

అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులుంటాయి

ఆదివాసి ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయి

అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి

ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలి

బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలనీ ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నాను

ఆదివాసీల హక్కులను ఎవరూ కాలరాయవద్దు

ఆ జాతి బిడ్డగా ఆది వాసులకు అండగా నిలుస్తాను

ఆపరేషన్ కగార్ తో ఆదివాసీలు తీవ్రభయాందోళనతో ఉన్నారు

మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలి

రెండు వైపుల ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయి

Use Social Media to Spread the Word about Our News

related articles