54
బేబీ ఫీడింగ్ సెంటర్ ఏర్పాటు ఎంతో శుభపరిణామం:
ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర
* పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో బేబీ ఫీడింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురంనకు చెందిన వెంకట ప్రసాద్ (బుజ్జి)ఆయన తండ్రి పేరున లైన్స్ క్లబ్ సౌజన్యంతోఈ సెంటర్ ను ఏర్పాటు చేయడం హర్షనీయమని ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆ కుటుంబ సభ్యులను అభినందించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ కు వస్తున్న వివిధ ప్రాంతాల బాలింతలు, చిన్నారులకు ఎంతో ఉపయోగకరమన్నారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కేంద్రం నిర్వహణలో ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సభ్యులు,టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు