*అర్హులైన పేదలకు దీపం పథకం అమలు చేయాలి*
*కలెక్టర్ ఆఫీస్ వద్ద సిపిఎం నిరసన*
బిపిఎల్ పరిధిలో ఉన్న అర్హులైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఉచిత గ్యాస్ సిలండర్ (దీపం) పథకం క్రింది డబ్బులు తక్షణమే లబ్ధిదారుల ఖాతాలకు జమచేయాలని సిపిఎం మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి.కృష్ణారావు డిమాండ్ చేసారు. సోమవారం ఎ.ఎస్.ఓ సర్కిల్ 2 పరిధి మద్దిలపాలెం, ఆరిలోవ ప్రాంత ప్రజలతో జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలండర్లు అర్హులైన పేదలందరికీ ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేసారు. మొదటి సారి ఉచిత సిలండర్ డబ్బులు నేటికీ అనేక మందికి అందలేదన్నారు. సిద్దార్ధనగర్, మద్దిలపాలెం, అంజయ్యనగర్, బి.ఎన్.ఆర్.నగర్, రామకృష్ణాపురం వంటి కొన్ని కాలనీలలో సిపిఎం ప్రజా చైతన్యయాత్ర చేపట్టిన సందర్భంలో గ్యాస్ సిలండర్స్ డబ్బులు పడలేదని చెప్పడంతో దరఖాస్తులు పెట్టించామన్నారు. కెవైసి, బ్యాంక్‌కు ఫోన్ లింక్ వంటి అనేక కారణాలు చూపి అత్యధికమందికి పడలేదన్నారు. మొదటిసారి పడినవారికి రెండవ సారి ఈ నెల పడాల్సి ఉండగా ఇప్పటికే రాలేదన్నారు. అందనివారిలో ఎక్కువమంది ఎస్సి, ఎస్టి, ఒంటరి మహిళ, వికలాంగులు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. తక్షణమే ప్రభుత్వం టీంలు వేసి ఉచిత గ్యాస్ పథకం అర్హులందరికీ వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎ.ఎస్.ఓ సిటీ అధికారికి వినతిపత్రం, దరఖాస్తులు అందజేసారు.
*ఎ.ఎస్.ఓ సర్కిల్`2 అధికారిని తక్షణమే నియిమించాలి(
సర్కిల్ `2 అధికారిని నేటికీ నియమించకుండా ఇన్చార్జ్ అధికారితో కాలంవెల్లుబుచ్చడం సరికాదన్నారు. రేసపువానిపాలెంలో ఉన్న ఎ.ఎస్.ఓ కార్యాలయం కలెక్టర్ ఆఫీస్‌కు తరలించడం వలన మధురవాడ, ఆరిలోవ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆర్టీసి కాంప్లెక్స్ నుండి మారికవలస ఉన్న ప్రజలందరికీ ఒకే ఎఎస్‌ఓ కావడంతో ప్రజలకు ఆఫీస్ అందుబాటులో ఉంచాలన్నారు. తక్షణమే అధికారిని నియమించి సర్కిల్ 2 కార్యాలయం డైరీఫాం ఆదర్శనగర్‌లో ప్రారంభించాలన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు వి.నరేంద్రకుమార్, కె.కుమారి, నాగరాజు, చంద్రమౌలి, ఎన్.వి.రమణ, జి.ఎస్.ఎన్.రాజు తదితరలు పాల్గొన్నారు.
ఇట్లు
వి.కృష్ణారావు
కార్యదర్శి
అర్హులైన పేదలకు దీపం పథకం అమలు చేయాలి*కలెక్టర్ ఆఫీస్ వద్ద సిపిఎం నిరసన*
43
previous post