*విశాఖ యువ కుడు అద్భుతం*
*ట్రైలర్ మేకింగ్ లో దేశంలో 6 వ స్థానం*
*తెలుగు రాష్ట్రా ల నుంచి ఒకే ఒక్కడు*
*30 న ముంబయి లో అవార్డు స్వీకరణ*
*భారత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ*
డాబాగార్డెన్స్.. ఏప్రిల్ 26
వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ మే ఒకటి నుంచి నాలుగు వరకు ముంబాయిలో జరగనుంది ఈ సదస్సుని మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో భాగంగా ట్రైలర్ మేకింగ్ క్యాటగిరిలో విశాఖకు చెందిన నిష్ఠల అన్వేష్ టాప్ 20 లో ఆరో స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శనివారం వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన అభినందన సభలో అన్వేష్ మాట్లాడుతూ యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్స్ ను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు ముఖ్యంగా సినీ పరిశ్రమలో ప్రముఖులతో సినీ పరిశ్రమపై ఆసక్తి ఉన్న ఔత్సాహిక కళాకారులకు సాంకేతిక నిపుణులకు కలిపేందుకు వీలుగా ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు గన్స్ అండ్ గులాబీ అనే వెబ్ సిరీస్ కు తాను ట్రైలర్ రూపొందించానని దానికిగాను ఆరవ స్థానం దక్కిందన్నారు.. ఈ నెల 30 న ముంబయి లో అవార్డు లు ప్రధాన ము చేస్తా రన్నారు.. ఈ వేదికను తాను సద్వినియోగపరచుకుంటానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా ఈ కార్యక్రమం భారత ప్రభుత్వం నిర్వహిస్తుందని ఔత్సాహికులు అందరూ ఈ వేదికను వినియోగించుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ మన మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు మణిశర్మ తనయుడు అన్వేష్ ఈ ఘనత సాధించడం మన జర్నలిస్ట్ కుటుంబాల అందరికీ గర్వకారణం అన్నారు ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల ఎంట్రీలు వస్తే అన్వేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడే కావడం అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో ముగ్గురిలో ఒకడు కావడం, సదస్సు ఎంపిక కావడం, ఈ ఘనత సాధించడం విశాఖకే గర్వకారణం అన్నారు.. సదస్సు నుంచి తిరిగి వచ్చిన తర్వాత తానే స్వయంగా మరో అభినందన సభ ఏర్పాటు చేస్తానని చెప్పారు కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు మణిశర్మ మాట్లాడుతూ నా కొడుకు అన్వేష్ కి ఇది ఒక మంచి అవకాశం అని విధిగా తన లక్ష్యం సాధించేందుకు ఈ సదస్సును వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు ఈ ఈ పోటీల్లో ఈ సినిమా ట్రైలర్ మేకింగ్ క్యాటగిరీని ఐ ఎన్ పి ఆర్ నెట్ ఫిక్స్ తో సంయుక్తంగా నిర్వహించిందని అన్వేష్ సాధించిన ఘనత మేరకు నెట్ ఫ్లిక్స్ కు ఆర్థరైజ్ ఎడిటర్ సర్టిఫికెట్ దక్కుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న అన్వేష్ కుటుంబ మిత్రులు అధికారుల రవి శాస్త్రి మాట్లాడుతూ చిన్నతనం నుంచే అన్వేష్ తనకు తెలుసని డ్రాయింగ్ పై ఉన్న మక్కువ కారణంగా తన తండ్రి మణిశర్మ గుర్తించి మల్టీ మీడియా కోర్స్ లో చేర్పించడం జరిగిందన్నారు తల్లిదండ్రులు పిల్లల అభీష్టం మేరకు నడుచుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు కార్యక్రమంలో దీపక్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.