39
వేసవి వేడికి ఏ జీవి మృత్యువాత ఉంచండి .
– సుమతీ బాయి, హెడ్ మాస్టర్, కెడిపిఎం హైస్కూల్
వేసవి వేడికి ఏ జీవి మృత్యువాత పడరాదని కెడిపిఎం హైస్కూల్ హెడ్ మాస్టర్ సుమతీ బాయి విద్యార్థులను కోరారు. బుధవారం ఉదయం ఆస్ట్రేలియన్ కాన్సలేట్ సంస్థ, వ్యూస్ ఎన్ జి ఒ నేతృత్వంలో కెడిపిఎం విద్యా సంస్థలో పక్షులు, వన్యప్రాణుల కోసం నీరు అందుబాటులో ఏర్పాటు చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. శీతోష్ణస్థితి వేడెక్కడం వలన అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి అన్నారు. కాబట్టి సమస్త జీవరాశి నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళి దే అన్నారు. ఏ జీవి అంతరించినా దాని ప్రభావం మానవాళి మీదే పడుతుంది అని గుర్తించుకోవాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యూస్ సంస్థ కో ఆర్డినేటర్ జె రాజేశ్వరి, పలువురు విద్యార్థులు మాట్లాడారు.