మంగపేట మండలం.
ములుగు జిల్లా.
కళ్యాణ బ్రహ్మోత్సవాలకు
(జాతర) వచ్చే భక్తులకు అన్ని
సౌకర్యాలు కల్పించాలి.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,
స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.
శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి
కళ్యాణ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,
స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు.
మంగళవారం మంగపేట మండల మల్లూరు గ్రామం లోని శ్రీ హేమాచల
లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం లో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,
స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారుల తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మే 8వ తేది నుండి 17 వరకు శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, పారిశుద్ధ్యం, త్రాగునీటి పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పార్కింగ్ స్థలాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సైన్ బోర్డులు, త్రాగునీరు, టాయిలెట్ తదితర అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగాలన్నారు. భక్తులకు చేపడుతున్న సౌకర్యాల కల్పనలో రాజీపడవద్దని, ప్రతి అంశంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. దర్శనం కోసం క్యూ లైన్ లు, లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.
అనంతరం మంత్రి కళ్యాణ బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు .
ఈ కార్యక్రమంలో ఈఓ, ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా అధికారులు,
మండల అధికారులు, పూజారులు,
ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి కళ్యాణ బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు మంత్రి సీతక్క పాల్గొన్నారు
43