భూగోళం సమస్త జీవరాశి తో కలకాలం కళకళలాడాలి
– పర్యావరణ హితంగా జీవించడం మన బాధ్యత
– ప్రొఫెసర్ ఇయుబి రెడ్డి, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్, ఆంధ్ర విశ్వవిద్యాలయం
భూగోళం సమస్త జీవరాశి తో కలకాలం కళకళలాడాలి అని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఇయుబి రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మాధవధార కార్యాలయంలో మంగళవారం ధరిత్రి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చిత్ర లేఖనం పోటీలలో పాల్గొన్న వారికి బహుమతి ప్రధానం అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్త జీవరాశి నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళి దే అన్నారు. ఏ జీవి అంతరించినా దాని ప్రభావం మానవాళి మీదే పడుతుంది అని హెచ్చరించారు.
ఎపి పిసిబి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పివి ముకుందరావు మాట్లాడుతూ ధరిత్రి దినోత్సవం వేడుకలు నిర్వహించడమే కాదు నిరంతరం పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చెయ్యాలి అని కోరారు. పర్యావరణ హిత జీవన విధానం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎపి పిసిబి ఎస్ ఇ లు రామారావు నాయుడు, నాగిరెడ్డి, ఇఇ శ్రీనివాస్, ఎఎమ్ శ్రీనివాస్
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, గ్రీన్ వాలంటీర్లు జె రాజేశ్వరి, ఐ కృష్ణ కుమారి, జె రవి తేజ, తదితరులు పాల్గొన్నారు.
ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ధరిత్రి దినోత్సవం443నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన 2025
48