*వైశ్యరాజు జ్యూయలర్స్ సహకారంతో సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన కళావేదికను, హ్యాండ్ వాష్ బేసిన్ల ను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
* జైల్ రోడ్ జూనియర్ బాలికల కళాశాల లో మెరుగైన సౌకర్యాల కల్పనకు ఎమ్మెల్యే కృషి
ఈరోజు జైల్ రోడ్ వద్ద గల విశాఖ ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు) విశాఖపట్నం నందు శ్రీ వైశ్యరాజు జ్యూయలర్స్ వారి సి ఎస్ ఆర్ నిధులతో నిర్మించబడిన కళావిధిగా మరియు హ్యాండ్ వాష్ బేసిన్ల ప్రారంభత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, శ్రీ వైశ్యరాజు జ్యూయలర్స్ స్థాపకులు మరియు చైర్మన్ గారు వైశ్యరాజు పాల్గుణ రాజు గారు, వారి కుమారులైన శ్రీ వైశ్యరాజు గిరి గారు, నరేష్ గారు వారి కుటుంబ సభ్యులు మరియు నేతలు ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ శ్రీ వైశ్యరాజు జ్యూయలర్స్ సేవా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం హర్షించ దగ్గ విషయం అని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తు దృష్ట్యా వారికి కావలసినటువంటి కనీస సదుపాయాలు తో పాటు కళాశాల మెరుగైన సౌకర్యాలు కల్పించుటకు తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు హామీ ఇచ్చారు. దక్షిణ నియోజకవర్గంలో మరిన్ని పనులకు సిఎస్ఆర్ ద్వారా శ్రీకారంకు ప్రయత్నిస్తున్నానీ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు పాల్గొనగా, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి విజయ సబాద్యక్షత వహించగా, ఇంటర్ విద్యా జిల్లా అధికారి శ్రీమతి రాధ గారు తో పాటు నిర్వహణ బాధ్యతలను డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్ గారు చేపట్టారు. అనంతరం ఇంటర్ ఫలితాలు అద్భుత ఉత్తమ మార్కులు సాధించిన టాపర్ లకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతులమీదుగా సన్మానించారు.