విశాఖ మేయర్ పీఠం కోసం నరాలు తెగే ఉత్కంఠ!
విశాఖపట్నం :
జీవీఎంసీ మేయర్ పదవి నాటి కన్నా ఈ రాత్రి హాట్ టాపిక్ — విశాఖ రాజకీయ గాలి వేడెక్కింది. మలేసియా నుంచి వచ్చే ఓ ప్రత్యేకమైన విమానం పై రెండు పార్టీల నేతల్లో ఊపిరి పట్టేసే ఉత్కంఠ.
ఈరోజు రాత్రి 11.30కి ల్యాండ్ కావాల్సిన విమానం అరగంట ఆలస్యం కావడంతో టెన్షన్ డబుల్ అయింది. ఎవరు దిగుతారు? ఎవరు మిస్ అవుతారు? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
👉ఎయిర్‌పోర్టు పరిసరాలు ఇప్పటికే హౌస్ ఫుల్! కార్పొరేటర్ల రాక కోసం పార్టీ కేడర్ హోరెత్తుతోంది. ఈ సీన్ అంతా చూస్తే బహిరంగంగా రాజకీయ నాటకం లా ఉంది.
✍️కూటమిలో టెన్షన్ మితిమీరింది. అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కు ముందు ఈ డెవలప్‌మెంట్లు ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. వైసీపీ వర్గాలు అయితే “అవిశ్వాసం కూలిపోవడం ఖాయం” అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
👉కార్పొరేటర్లను టూర్‌కు పంపిన నాయకులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. రేపు జీవీఎంసీ సమావేశానికి ఏయే కార్పొరేటర్లు హాజరవుతారు? ఎవరు రారు? అన్నది పొలిటికల్ సర్కిల్‌లో హాట్ డిబేట్.
✍️రాష్ట్ర రాజకీయంగా హైవోల్టేజ్ సన్నివేశంగా మారిన ఈ సంఘటనకు భద్రతా వ్యవస్థ కూడా హై అలర్ట్. సీపీ ఆదేశాలతో ఇప్పటికే 500 మందికి పైగా పోలీసులు ఎయిర్‌పోర్ట్ చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు.
విశాఖలో రాత్రి రాజకీయ వేడి గరిష్ట స్థాయికి చేరింది!
మేయర్ పదవి ఎన్డీఏ కూటమికే వస్తుందని సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు
29