లేబర్ కోడ్స్ రద్దు చేయాలి.మే 20 అఖిల భారత సమ్మె జయప్రదం చేయండి.-అఖిలపక్ష కార్మిక సంఘాలు.

by vvwnews.com

లేబర్ కోడ్స్ రద్దు చేయాలి.
మే 20 అఖిల భారత సమ్మె జయప్రదం చేయండి.
-అఖిలపక్ష కార్మిక సంఘాలు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలు మే 20వన జాతీయ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసం ఈరోజు విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో గల సిఐటియు ఆఫీసు నందు అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మక సంఘాల నాయకులు ఆర్కే ఎస్ వి కుమార్ (సిఐటియు)
బి.నాగభూషణం (Intuc),Sk.రెహమాన్(Aituc)N. కనకారావు (Cftui) దేవా (Apftu) రామకృష్ణ రాజు(Aicctu) అనీల్ కుమార్(ysrtu) లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన నాటి నుండి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలను కాలరాస్తుందన్నారు. అందులో భాగంగానే బ్రిటిష్ కాలంలోనే పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా మార్పు చేసిందన్నారు. ఈ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి అనేక హక్కులను కోల్పోతారన్నారు. పని గంటలు విపరీతంగా పెరుగుతాయి అన్నారు ఎనిమిది గంటల పని దినం బదులు 15 పనిచేయవలసిన పరిస్థితి వస్తుందన్నారు. సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసుకునే హక్కు యాజమాన్లతో జీతభత్యాలు బేరం ఆడుకునే హక్కులను కోల్పోతారు అన్నారు. ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులో ఏ విధమైన కార్మిక చట్టాలను అమలు చేయకుండా వారికి ఇష్టం వచ్చినట్లు కార్మికులను తొలగిస్తున్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను అన్నింటిని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుందన్నారు ఇప్పటికే రైల్వే, పోర్టులు, విమానాశ్రయాలు చమురు సంస్థలు టెలికం వ్యవస్థను బ్యాంకింగ్ వ్యవస్థను ఇలా అన్నిటిని ప్రైవేట్ వాళ్లకి కట్ట బెడుతుందన్నారు. లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు బానిసలుగా మారతారన్నారు. అందుకే దేశవ్యాప్తంగా మే 20వ తేదీ నాడు లేబర్ కోర్టు రద్దు చేయాలని అఖిలభారత సమ్మె జరుగుతుందని ఈ సమ్మెలో విశాఖపట్నంలోని ప్రభుత్వ,ప్రైవేట్ పరిశ్రమల్లో ను, సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు స్కీం వర్కర్స్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ చిరు వ్యాపారస్తులు ఇలా అందరూ ఈ సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మె జయప్రదానికి ఏప్రిల్ 27వ తేదీ నాడు జిల్లా కార్మిక సదస్సు జరుగుతుందన్నారు అన్ని పరిశ్రమల్లోనూ గేట్ మీటింగ్లు, కార్మికుల నివాస ప్రాంతాలు మరియు పని ప్రదేశాలలో సభలో సమావేశాలు జరిపి సమ్మె ప్రాధాన్యతను తెలియజేయాలని 20వ తేదీన జరుగుతున్న సమ్మె ర్యాలీలలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొనాలని కోరారు. మోడీ ప్రభుత్వానికి పరిశ్రమలను మూసేయడం ప్రైవేటుపరం చేయడం తప్ప కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడం, ఉద్యోగాలు కల్పించడం చేతకాదు అన్నారు. ఈ సమావేశంలో విశాఖపట్నం పోర్ట్ & డాక్ వర్కర్స్ యూనియన్ నాయకులు బి జగన్,శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ p. మణి ,మోటా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి అప్పలరాజు, విశాఖ జిల్లా ముఠావర్కర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
Rksv.కుమార్
Citu జిల్లా ప్రధాన కార్యదర్శి
(అఖిల పక్ష కార్మిక సంఘాల తరపున.)

Use Social Media to Spread the Word about Our News

related articles