*దాళ్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన రైతన్నలు*
*తూర్పు గోదావరి,దేవరపల్లి మండలం యర్నగూడెం*
పండించిన పంటను కోసి ఆరపోస్తున్నప్పటికీ అల్పపీడన ప్రభావం వల్ల ధాన్యం తడిచి ముద్ద అవుతుందని ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా వుండటం జరుగుతుందని తేమ శాతం ఎక్కువగా వున్న ధాన్యాన్ని ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం ద్వారా కొనుగోలు చేయాలని లేదంటే దళారుల చేతిలో మోసపోయే పరిస్థితి ఉందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు
ఈ విషయంపై యర్నగూడెం గ్రామ సమాచారం మండల వ్యవసాయ శాఖ అధికారి విజయ గారిని సంప్రదించగా ఈ విషయం పై మండల తహశీల్దార్ మరియు సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ యర్నగూడెం సొసైటీ సీఈవో మండ పెదబాబు తదితర అధికారులు ద్వార ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని ఈ విషయంపై పలు మిల్లర్లతో మాట్లాడటం జరుగుతుందని సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని విజయ్ తెలిపారు…