టీటీడీ గోశాలలో గోవులు చనిపోతున్నాయన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, టీటీడీ

by vvwnews.com

Gptmla

టీటీడీ గోశాలలో గోవులు చనిపోతున్నాయన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కుట్రలు జరుగుతున్నాయని టీడీపీ విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణ బాబు స్పష్టం చేశారు. పశ్చిమ టిడిపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీని బతికించుకోవడానికి నిత్యం ఏదో ఒక బూటకపు మాటలతో పబ్బం గడుపుకుంటున్న వైసీపీని ప్రజలు ఛీత్కరించుకుంటున్న వాళ్ళ వికృత వైఖరి మాత్రం మార్చుకోవటం లేదని, చివరకు దేవుడిని కూడా వదలకుండా నీచపు రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తిరుమలలో గోవులను దేవతల రూపంగా భావించి, పరమ పవిత్రతతో పూజించి పరిరక్షిస్తున్నామని చెప్పారు. గోవుల రక్షణకు టిటిడి లక్షల రూపాయలు ఖర్చుపెడుతుందని అన్నారు. టీటీడీ గోవుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందనీ, టిటిడీలో గతంలో దోచుకున్న డబ్బులు బయటకు తీయడానికి బోర్డు ఆలోచన చేస్తుందని చెప్పారు. ఇప్పటివరకు గోశాలలో ఏ ఒక్క గోమాత మరణించలేదన్నారు. వైసీపీ నేత ప్రెస్ మీట్ లో చనిపోయినట్లు చూపించిన ఆవుల ఫోటోలు ఇక్కడివి కావని, ఎక్కడో ఫోటోలు అడ్డుపెట్టుకుని టీటీడీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఆ ఫోటోలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు.

Use Social Media to Spread the Word about Our News

related articles