అనకాపల్లి రూరల్ పోలీసులు ఇద్దరు బాల నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు

by vvwnews.com

నిన్నటి తేదీ.11.04.2025 నుండి సామాజిక మాధ్యమాలలో అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిసినికాడ గ్రామంలో శివాలయం వద్ద, ఇద్దరు వ్యక్తులు వికృత చేష్టలతో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
ఈ సంఘటన గతంలో, అంటే తేది: 10.04.2018న జరిగింది. ఈ సంఘటనపై అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైం. నెం.52/2018, U/s 153(A), 295(A) r/w 34 IPC మరియు 66 IT చట్టం ప్రకారం కేసు నమోదు చేయబడింది.
తదుపరి దర్యాప్తులో, అనకాపల్లి రూరల్ పోలీసులు ఇద్దరు బాల నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని తేది:16.04.2018న గౌరవ 2 వ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు మరియు బాల నేరస్తుల కోర్టు, విశాఖపట్నం ముందు హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు జువనైల్ హోమ్‌కు తరలించారు. అనంతరం, తేది: 22.11.2018న కోర్టు వారు నిందితులకు శిక్ష విధించారు.
ఇటీవల వైరల్ అవుతున్న వీడియో గత సంఘటనకు సంబంధించింది. వాస్తవాలు తెలుసుకోకుండా, ఈ వీడియోను ప్రస్తుత ఘటనగా చెబుతూ సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడం, కామెంట్లు చేయడం వల్ల ప్రజల్లో అపోహలు కలుగుతున్నాయి.
అందువల్ల, ప్రజలు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరూ ఎటువంటి వీడియోలు షేర్ చేయవద్దని, చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నాము.
జి.అశోక్ కుమార్
*సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అనకాపల్లి రూరల్ సర్కిల్.*

Use Social Media to Spread the Word about Our News

related articles