వ్యాపార అవకాశాలకు పారిశ్రామిక & ఇంజనీరింగ్ ప్రదర్శన
ప్రదర్శన ప్రారంభించిన వారు : ……………………………………………
విశాఖపట్నం 11 ఏప్రిల్ 2025 : దేశంలోని ప్రముఖ పారిశ్రామిక ప్రదర్శనల సంస్థ ఇండోర్ ఇన్ఫో లైన్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే గాదిరాజు ప్యాలస్ , బీచ్ రోడ్డు, విశాఖపట్నం వద్ద ఈరోజు ఇండస్ట్రియల్ & ఇంజనీరింగ్ ఎక్స్ పో ప్రారంభించారు. ఈ పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ఏప్రిల్ 11, 12 & 13 తేదీలలో మూడు రోజులుపాటు పారిశ్రామిక మరియు ఇంజనీరింగ్ సంబంధిత నూతన ఆవిష్కరణలతో కూడిన ఉత్పత్తులతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇండోర్ ఇన్ఫో లైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గత దశాబ్ద కాలంగా పారిశ్రామిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాది.ఈ ప్రదర్శనకు VASSIWA, ఆం.ప్ర. MSME ఇండస్ట్రీస్ అసోసియేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ AP స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అసోసియేషన్స్ మరియు ఇతర అసోసియేషన్లు మద్దతు అందిస్తూన్నాయి. ఈ ప్రదర్శన వలన విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
ఈ ప్రదర్శన సందర్శనకు దేశం నలుమూలల నుండి సుమారు 10,000 మందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ ప్రదర్శన MSME రంగ విస్తరణకు దోహదపడటమే కాక, సందర్శించే ప్రతి ఒక్కరికి వ్యాపార అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఈ పారిశ్రామిక ప్రదర్శనలో 5000 యూనిట్ల వివిధ పారిశ్రామిక ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు, ఈ ఉత్పత్తుల స్థూల విలువ రూ. 25 కోట్లు పైగా ఉంటుంది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న అన్ని బ్రాండ్ల ద్వారా వచ్చే ఏడాది కాలంలో రూ.50 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేస్తామని విశ్వసిస్తున్నామని నిర్వాహకులు చెపుతున్నారు.
ఈ ప్రదర్శన డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు మరియు తయారీదారులు తమ నెట్ వర్కింగ్ మరియు వ్యాపార విస్తరణకు గొప్ప అవకాశాలు కలిగిస్తుంది. భారతదేశం నలుమూలలలోని హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, కోల్ కతా, నాగపూర్ వంటి నగరాల నుండి 50 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఈ ప్రదర్శనలో పాల్గొని తమ ఉత్పత్తులైన లేజర్ కటింగ్ మిషన్లు, చేతి పనిముట్లు, మిషన్ టూల్స్, స్టీల్ ఉత్పత్తులు, ఆటోమేషన్, వెల్డింగ్ పరికరాలు, బేరింగులు, సైంటిఫిక్ పరికరాలు, ల్యాబ్ పరికరాలు, మెటీరియల్ హెండ్లింగ్ ఉత్పత్తులు , భద్రతాపరమైన ఉత్పత్తులు, నిర్వహణా ఉత్పత్తులు మరియు ఇంజనీరింగ్ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారు.
ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు ప్రదర్శనలో పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది మేము సరఫరాదారులు, తయారీదారులు మరియు డీలర్లు, పంపిణీదారులు, స్టాకిస్టులు, ఇంటిగ్రేటర్ల మధ్య B2B సమావేశాన్నిఈ ప్రదర్శన ద్వారా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇది నగరంలో కొత్త వ్యాపార అవకాశాల కల్పనకు దారితీస్తుందని వారు చెపుతున్నారు.
వైజాగ్ మరియు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు ముందుకు వచ్చి ఈ ప్రదర్శనను సందర్శించి, త్వరలో రాయపూర్, నాగపూర్ , హైదరాబాద్ మరియు ముంబైలలో జరగబోయే పారిశ్రామిక ప్రదర్శనలలో పాల్గొని తమ ఉత్పత్తులను మరియు బ్రాండ్ ప్రచారాన్ని ప్రోత్సహించాలని కోరుతున్నారు.ప్రదర్శన సమయం ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటలు వరకు ఉంటుంది. అందరికి ప్రవేశం ఉచితం.
R.K అగర్వాల్, మేనేజింగ్ డైరెక్టర్,
ఇండోర్ ఇన్ఫోలైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోన్ 9425054216