గ్రుప్ 2 అభ్యర్థులు అనుమానాలు నివృత్తి చేయండి – డివైఎఫ్ఐఎంవిపి ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్ వద్ద

by vvwnews.com

గ్రుప్ 2 అభ్యర్థులు అనుమానాలు నివృత్తి చేయండి – డివైఎఫ్ఐ

ఎంవిపి ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్ వద్ద జరుగుతున్న ధర్నా కు డివైఎఫ్ఐ మద్దతు తెలిపింది. గత ప్రభుత్వం అనేక పోరాటాలు తర్వాత గ్రుప్ 2 లో 899 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని అయితే రోస్టర్ పాయింట్స్ లో మిస్టేక్స్ ఉన్నాయని నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఎపిపియస్సి స్పందించి రోస్టర్ పాయింట్స్ లో జరిగిన పొరపాట్లును సరి చేసి భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డివైఎఫ్ఐ విశాఖ జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేసారు. డివైఎఫ్ఐ గ్రూప్ 2 అభ్యర్థులు కు మద్దతుగా నిలుస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కొరకు సుమారుగా 92250 మంది అభ్యర్థులు ఫిబ్రవరి 23 తేదిన జరిగే మొయిన్స్ పరీక్షలు జరుగుతాయో లేదో అని గందరగోళం పై గురువారం హైకోర్టు స్పష్టత ఇచ్చిందని అయితే రోస్టర్ పాయింట్స్ మీస్టేక్స్ సరి చేయకుండా అభ్యర్థులకు న్యాయం జరగదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేయాలని కోరారు.

గత రెండు వారాలు నుండి నిరుద్యోగులు మానసిక వేదనతో సతమతమవుతున్నారని ఐదేళ్ళ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని గతంలోనే ఈ ప్రభుత్వం అంగీకరించిందని ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని విమర్శించారు. రోస్టర్ విధానంలో తప్పులు ఉండటం వలన గతంలో కోర్టులో తీర్పు ద్వారా కొన్ని రాష్ట్రాలలో నోటిఫికేషన్లు సైతం రద్దు చేయడం మరియు ఉద్యోగం చేస్తున్న వారిని సైతం తొలిగించిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇదే సంఘటన జరిగిందని గుర్తు చేశారు. గ్రూప్ 2 అభ్యర్థులకు రోస్టర్ విధానం లో ఉన్న తప్పులిని సరిదిద్దాలని కోరారు. రోస్టర్ సరిచేసి ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి బాధ్యత పెట్టిందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రోస్టర్ పాయింట్స్ లో జరిగిన మిస్టేక్స్ సరి చేసి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ప్రేమ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles