హరేకృష్ణవైకుంఠం గంభీరం చైతన్య భవనం ప్రారంభోత్సవం శ్రీ శ్రీ రాధా కృష్ణ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం

by vvwnews.com

హరే కృష్ణ వైకుంఠం -గంభీరం -ఐఐఎం రోడ్ , ఆనందపురం
చైతన్య భవనం ప్రారంభోత్సవం- శ్రీ శ్రీ రాధా కృష్ణ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం
14 వతేది నుంచి 18 వ తేదీ ఫిబ్రవరి 2025 వరకు మహోత్సవం-కార్య క్రమ వివరాలు

ఈ కార్యక్రమములో ఈ రోజు నాల్గొవ రోజు 17-02-2025 న అతి ముఖ్యమైన ఘట్టం ప్రాణ ప్రతిష్ట కార్యమ్రమం ఉదయం 8 గంటల భక్తులు సమక్షములో యజ్ఞం నిర్వహించి వేదపండితుల మంత్రోచ్చారణ నాధుమ ప్రారంభించడం జరిగింది . విశ్వగురువు శ్రీల భక్తి వేదాంత స్వామివారి విగ్రహమును ప్రతిష్టించడం జరిగింది . అనంతరం 10 గంటల 40 నిముషములకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము మరియు విగ్రహ మూర్తులకు శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ స్వామిగా పేరును పద్మ శ్రీ మధుపండిత దాస గారిచే చేయడం జరిగింది .
పద్మ శ్రీ మధు పండిత దాస , ఛైర్మన్ గ్లోబల్ హరే కృష్ణ మూవ్‌మెంట్, ప్రెసిడెంట్ ఇస్కాన్ బెంగళూరు, ఛైర్మన్ బృందావన్ చంద్రోదయ మందిర్, ఫౌండర్-చైర్మన్ అక్షయ పాత్ర ఫౌండేషన్, గారు భక్తులకు ఈ రోజు ప్రాముఖ్యతను వివరించారు .
1. హరే కృష్ణ మూవ్మెంట్ వ్యస్థాపకులు శ్రీ శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభు పాద గారు 17-02-1972 తేదీన లో విశాఖ మహానగరముకు వచ్చి జిల్లా పరిషత్ దగ్గర ఉన్న శ్రీ చైతన్య గౌడీయ మఠ్ కార్యక్రమములో పాలుగున్నారు .
2.శ్రీ శ్రీ శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభు పాదుల గారు సింహాచలం శ్రీ శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకున్న రోజు 17-02-1972
3. శ్రీ శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభు పాద గారి గురువు గారైన శ్రీ శ్రీ శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి జయంతి సందర్భముగా ఆహారతి నిర్వహించి భక్తులు పుష్పాంజలి అర్పించారు .
అనంతరం భక్తులు శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ స్వామి వారికీ ఆహారతి నిర్వహించం జరిగింది అనంతరం భక్తులు అందరికి ప్రసాద వితరణ చేయడం జరిగింది .

కుంభాభిషేఖం :ప్రప్రధమంగా సాయంత్రం 6 గంటల 30 నిముషములకు వేద మంత్రముల నడుమ శ్రీ శ్రీ రాధా మదన మోహన్ స్వామికి కుంభాభిషేఖం నిర్వహించడం జరిగింది .
ఈ అభిషేకములో సప్తనదుల నుంచి ( గంగ , యమునా,గోదావరి,సరస్వతి ,నర్మదా,సింధు,కావేరి) సేకరించిన జలాలతో,108 పవిత్ర జల కలశాలతో, పళ్ళ రసాలు,పంచామృతం ,పంచగవ్యాలతో మరియు వివిధ పుష్పములతో అంగ రంగ వైభవముగా అభిషేకము జరిగింది .

ఈ కార్యక్రములో పాలుగున్న ప్రముఖులు
పద్మ శ్రీ మధు పండిత దాస , ఛైర్మన్ గ్లోబల్ హరే కృష్ణ మూవ్‌మెంట్, ప్రెసిడెంట్ ఇస్కాన్ బెంగళూరు, ఛైర్మన్ బృందావన్ చంద్రోదయ మందిర్, ఫౌండర్-చైర్మన్ అక్షయ పాత్ర ఫౌండేషన్,
శ్రీమాన్ శ్రీ సత్య గౌర చంద్ర దాస గారు, ప్రెసిడెంట్ హరే కృష్ణ మూవ్మెంట్ ఆంధ్ర మరియు తెలంగాణ ,
శ్రీమాన్ వాసుదేవ కేశవ ప్రభు వైస్ ప్రెసిడెంట్ ఇస్కోన్ బెంగళూరు, . శ్రీ మాన్ యుధిష్టిర కృష్ణ దాసు – ఉపాధ్యక్షుడు బృందావన్ చంద్రోదయ మందిరం, బృందావన్, ఉత్తర ప్రదేశ్, శ్రీ మాన్ జగన్ మోహన్ కృష్ణ దాస- ప్రెసెంట్ , హరే కృష్ణ మూవ్మెంట్ అహ్మదాబాద్, శ్రీ మాన్ వంశీధర్ దాస -ప్రెసిడెంట్ హరే ,కృష్ణ మూవ్మెంట్ విజయవాడ, శ్రీమాన్ నిష్క్రించిన భక్త దాస గారు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది .
రేపు నిర్వహించు ముఖ్య కార్యక్రమాలు .
18-02-2025 ఉదయం 8 గంటల నుంచి శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ స్వామివారి ప్రధమ దర్శనం ఈ కార్యక్రమములో పాలుగుని శ్రీ శ్రీ రాధా కృష్ణుని కృపకు పాత్రులు కాగలరని శ్రీ అంబరీష దాస గారు ఈ పత్రిక ప్రకటన ద్వారా వి జ్ఞ్యప్తి చేయుచున్నారు .
ఇట్లు
శ్రీ యదురాజ దాస
హరే కృష్ణ వైకుంఠం , గంభీరం , ఐఐఎం రోడ్
9010611108

Use Social Media to Spread the Word about Our News

related articles