పింక్ సఖీ శారీ వాక్ పోస్టర్ ఆవిష్కరణ
విశాఖపట్నం 7 ఫిబ్రవరి2025: ఈరోజు స్థానిక ది పార్క్ హోటల్ నందు ప్రప్రధమంగా ఆంధ్రప్రదేశ నందు పింక్ సఖి శారీ వాక్ నకు సంబంధించిన పోస్టర్ ను విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి గొలగాని హరి వెంకట కుమారి లాంఛనంగాఆవిష్కరించారు. ఈ పోస్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం పత్రికా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డి.ఎస్. ఆనంద్, గురుద్వార సత్ సంగత్ అధ్యక్షులు, డాక్టర్ ఆదిత్య, HCG క్యాన్సర్ హాస్పిటల్, శ్రీమతి ఫర్జానా బేగం, ఫౌండర్ -ఫిట్ విత్ ఫ్యాబ్, డాక్టర్ మీనాక్షి అనంతరామ్, వైస్ ప్రెసిడెంట్, రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ (RMT), శ్రీమతి గుర్మీత్ కోహ్లీ, డైరెక్టర్-ప్రాజెక్ట్స్ (RMT) మొదలైన ప్రముఖులు మరియు కార్యక్రమం (ఈవెంట్) స్పాన్సర్ చేస్తున్నవారితోపాటుగా అనేకమంది ఇతరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గౌరవనీయులైన మేయర్, శ్రీమతి గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ ఇటువంటి విశిష్ట కార్యక్రమం నిర్వహణకు చొరవ చూపినందుకు చాల సంతోషంగా ఉంది అన్నారు. క్యాన్సర్ గురించి మహిళలకు అవగాహ కల్పించే కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులను ఆమె ప్రశంసించారు. క్యాన్సర్ అవగాహన కల్పించు ఇలాటి కార్యక్రమాలకు పూర్తీ స్థాయిలో సహాయసహకారాలు అందిస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ (RMT) వారు రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ ఇండియా వారి సహకారంతో ఈ పింక్ సఖి శారీ వాక్ కార్యక్రమాన్ని16 ఫిబ్రవరి, 2025 ఆదివారం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ మాసోత్సవం సందర్భంగా మహిళలకు క్యాన్సర్లపై అవగాహన కలిగించుటకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర ఆరోగ్య శాఖ, CMR గ్రూప్, HCG క్యాన్సర్ హాస్పిటల్, ప్రముఖ ఆంకాలజిస్టులు, మరియు అనేక కార్పొరేట్ సంస్థలు మరియు సామాజిక సంస్థలు తమ మద్దతును అందిస్తున్నాయి.
ఈ పింక్ శారీ వాక్ నందు పాల్గొనుటకు అందరూ sareewalk.pinksakhi.com లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు అభ్యర్థించారు. ఇందుకోసం నమోదు చేసుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే, దయచేసి శ్రీ రఘురామ్ గారిని 9533110061 లేదా శ్రీ వీర్రాజు గారిని 9348623225 సంప్రదించగలరు.
రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ 16 ఏళ్ల క్రితం స్థాపితమై వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది ముఖ్యంగా క్యాన్సర్ అవగాహన, కౌన్సెలింగ్, పాలియేటివ్ మెడికల్ క్లౌనింగ్ రంగాలలో సామాజిక అభ్యున్నతి మరియు మహిళా సాధికారతకు కృషి చేస్తున్నాది. ఇతర కంపెనీలు మరియు సంస్థలు ముందుకు రావాలని తమ వంతు మద్దతును అందించాలని ట్రస్టు కోరుచున్నాది.
పింక్ సఖీ శారీ వాక్ పోస్టర్ ఆవిష్కరణవిశాఖపట్నం 7 ఫిబ్రవరి2025: ఈరోజు స్థానిక ది పార్క్ హోటల్
53