*ప్రచురణార్థం*
*. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని*
* చలో కలెక్టరేట్ అడ్డుకున్న పోలీసులు *
*ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ తో పాటు పలువురు అరెస్టు **.
రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహా ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయానికి రాలీగా బయలుదేరుతున్న కార్మికులను యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణతోపాటు జిల్లా అధ్యక్షులు కోటా సత్తిబాబు నాయకులు ఏం. మదన్ మోహన్ బి ప్రతాప్. కూన కృష్ణారావు ఎన్. సూర్యనారాయణ.కె ఈశ్వరరావు ఎం యోగి. దాలి బాబు.రామకృష్ణ. రమనేశ్వరి ఆర్ సత్తిరాజు. బోర. రమణ. ఆర్ కృష్ణ.సూరిబాబు తదితరులును అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి పెనం పై నుండి పొయ్యిలో పడినట్లుగా చందగా
ఉన్నదిఅన్నారు . గత జగన్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం 1996 అడ్డం పెట్టుకొని వెల్ఫేర్ బోర్డు పేరుతో నిర్మాణ యాజమానులు.ప్రభుత్వ సంస్థలు నుండి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నజగన్ సొంత ప్రయోజనాలకు వాడుకున్నారుతప్ప కార్మికులకు ఒక రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయలేదున్నారు.
ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం గెలిస్తే ఇసుక పాలసీని మారుస్తామని అందరికీ ఇసుక ఉచితంగా ఇస్తామని సంక్షేమ బోర్డును పునఃప్రారంభించి భవన నిర్మాణ కార్మికుల ఆదుకుంటామని నేడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఫైల్ మీద పెడతామని చెప్పిన నేతలు అధికారంలోకి రాగానే అవన్నీ మరిచిపోయి చంద్రబాబు ప్రభుత్వం వచ్చి నెలలు గడుస్తున్నా 50 లక్షల మంది కార్మిక ప్రయోజనాల కోసం ఏర్పడిన సంక్షేమ బోర్డు నిధులు, విధులు, వినియోగం పై చర్చించి చర్యలు తీసుకోకపోవడం అత్యంత దుర్మార్గంఅని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుంచి ప్రారంభమైన రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం 1996 అమలు చేస్తూ కార్మికులకు ఇతర సౌకర్యాలు కల్పిస్తూ చర్చించాలని డిమాండ్ చేశారు సంక్షేమ బోర్డు పునరుద్ధరించి ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగా బోర్డు ద్వారా కార్మిక స్కీం లు ప్రయోజనాలు అమలు చేయాలని.. బోర్డు నుండి గత ప్రభుత్వం దారి మళ్లించిన నిధులను . అలాగే రాష్ట్ర విభజన సందర్భంగా ఉమ్మడి రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు నుంచి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ బోర్డుకి రావలసిన వాటాను తెలంగాణ ప్రభుత్వం నుండి రప్పించాలని డిమాండ్ చేశారు కొత్త ఇసుక పాలసీని పెట్టి . అందరికీ ఇసుక ఉచితమే అంటూ ప్రకటించి . ఆచరణలో చూసినప్పుడు ఇసుక ఉచితంగా రావడం లేదున్నారు కొంతమంది దళారీలు ఇసుక బ్లాక్లో చేసి అధిక ధరలకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వమే అన్ని నగరాలలో స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక సరఫరా చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇసుక రీచ్ల వద్ద నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని అక్రమ ఇసుక . అరికట్టి సహజ సంపద అయిన ఇసుకను సామాన్య ప్రజలకు అందుబాటులో తెచ్చి కార్మికులు కు ఉపాధి కల్పించాలనిప్రభుత్వం తక్షణమే సంక్షేమ బోర్డు పునరుద్దరణ చేయాలని, పెండింగ్ లో ఉన్న క్రైం లు యివ్వాలని, పెరిగిన స్టిల్, సిమెంట్, ఐరన్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు
కార్యక్రమం లో ఏఐటీయూసీ నాయకులు కేలం శివ.కోటాన. ఆనంద్. ఎన్ మధు . వినోద్. లక్ష్మీనారాయణ. జి సతీష్ అప్పలస్వామి వెంకట్ . పాల్గొన్నారు.
*. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని
62