సంకల్పం Be Smart – Don’t Start

by vvwnews.com

*అనకాపల్లి జిల్లా పోలీసు*
*పత్రికా ప్రకటన*

*మాదకద్రవ్యాల మత్తులో పడొద్దు మీ బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు*
*- అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపిఎస్*

*యువతను మేలు కొల్పేందుకు అన్ని కళాశాలల్లో “సంకల్పం” కార్యక్రమం నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు*

*డ్రగ్స్ గురించిన సమాచారాన్ని 93929 18196 ఫోన్ చేసి గాని వాట్సాప్ ద్వారా గాని సామాజిక బాధ్యతగా తెలపండి:జిల్లా ఎస్పీ*

*అనకాపల్లి, నవంబర్ 11:* విద్యార్ధులు, యువతను సన్మార్గంలో నడిపి, వారిలో వ్యక్తిత్వ వికాశం, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగు పర్చి, ఉన్నత లక్ష్యాలను సాధింప జేసేందుకు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా వారి ఆదేశాల మేరకు సబ్ డివిజన్ల పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో వివిధ స్కూల్స్ మరియు కాలేజీల్లో ఈరోజు నుండి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.

*ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపిఎస్ మాట్లాడుతూ:* నేడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడమన్నది ప్రధాన సమస్యగా మారిందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత ఏవిధంగా చెడిపోతున్నారో వివరించి, వారిని తిరిగి సన్మార్గంలో నడిపేందుకు జిల్లా పోలీసుశాఖ *”సంకల్పం”* అనే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాల్లో నిర్వహించి, మాదక ద్రవ్యాల వినియోగం యువతపై ఏవిధంగా చెడు ప్రభావాన్ని చూపిస్తున్నది. వారి జీవితాలను, కుటుంబాలను ఏవిధంగా అస్తవ్యస్తం చేస్తున్నదన్న విషయాలు సులువుగా అర్ధమయ్యే విధంగా పోస్టర్లు, పాంప్లెట్లు మరియు బ్యానర్లు సంబంధిత స్కూల్ మరియు కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చిన్న చిన్న వీడియోలను ప్రదర్శిస్తున్నామన్నారు. అదే విధంగా మత్తు పదార్థాలు యువత శరీరం, నాడీ వ్యవస్థపై దుష్ప్రభావాన్ని ఏవిధంగా చేస్తుందో పవర్ పాయింట్ ప్రజెంటేషనుతో వివరించి, యువతలో చైతన్యం తీసుకొని వచ్చేందుకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగిందన్నారు.

యువత ఒకసారి డ్రగ్స్ ను వినియోగిస్తే ఏమీ కాదన్న భ్రమలో ఉంటారని, కాని డ్రగ్స్ ఒకసారి వినియోగించిన తరువాత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడానికి ఎంతో సమయం పట్టదన్నారు. తోటి స్నేహితులు ప్రోద్భలంతోనో, డ్రగ్స్ తీసుకొంటే ఏవిధమైన ఆనందాన్ని పొందవచ్చునో తెలుసుకోవాలన్న ఆసక్తి, స్నేహితులు హేళన చేస్తారనో, చులకనగా చూస్తారన్న భావనతోను వారి ఒత్తిడికి తలొగ్గి, మాదక ద్రవ్యాలను సేవించడం, వాటికి అలవాటు వడి, చివరకు బానిసలుగా మారుతారన్న వాస్తవాన్ని యువత గుర్తించలేకున్నారన్నారు.

డ్రగ్స్ వినియోగాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వాలు మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేకంగా చట్టాలను రూపొందించి, శిక్షలను కఠినతరం చేసారన్నారు. హత్య చేసిన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించి,14 సం. ల జైలు జీవితం తరువాత జైలు నుండి విడుదల చేస్తుంటే, గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో పట్టుబడిన నిందితులకు గరిష్టంగా 20సం.లు వరకు శిక్ష విధిస్తున్నారంటే ఈ తరహా నేరాలు, చట్టాల తీవ్రతను ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన యువకులు డ్రగ్స్ కు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడి నేరస్థులుగా మారుతున్నారన్నారు. నేరస్థులుగా మారిన వారిపై పోలీసు నిఘా ఉంటుందని, వారు ఏ ఉద్యోగంలో చేరినా, విదేశాలకు వెళ్ళాలనుకున్నా పోలీసు వెరిఫికేషనులో వారి నేరచరిత బయటపడుతుందని,
తద్వారా ఉపాధి, అవకాశాలు కోల్పోతారన్నారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండాలని, ఒకవేళ అలవాటు పడితే ఎటువంటి సంకోచం లేకుండా డీ అడిక్షన్ సెంటరులో ప్రాధమిక స్థాయిలో చికిత్స పొందితే, వాటినుండి బయట పడవచ్చునని జిల్లా ఎస్పీ అన్నారు. భవిష్యత్తులో డ్రగ్స్ వినియోగదారులు, అమ్మే వారి, సరఫరా చేసేవారి సమాచారం *93929 18196* ఫోన్ చేసి గాని వాట్సాప్ ద్వారా గాని సామాజిక బాధ్యతగా తెలియజేయాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు.

ఈ కార్యక్రమంలో నర్సీపట్నం సబ్ డివిజన్ శ్రీ జి.ఆర్.ఆర్.మోహన్, పరవాడ సబ్ డివిజన్ శ్రీ కె.వి.సత్యనారాయణ అనకాపల్లి సబ్ డివిజన్ శ్రీమతి ఎం.శ్రావణి అధికారులు మరియు జిల్లాలోని సిఐలు, ఎస్ఐలు విద్యార్థులను ఉద్ధేశించి ప్రసంగించారు.

*జిల్లా పోలీసు కార్యాలయం,*
*అనకాపల్లి.*

Use Social Media to Spread the Word about Our News

related articles