సేంద్రీయ పత్తి, ప్రకృతి సిద్దమైన రంగులను ఉపయోగించి వస్త్రాలను వాడుకలోకి తెచ్చారు నీత్ డిజైనర్స్ వ్యవస్థాపకురాలు లక్ష్మి కొండాల. ఈ సరి కొత్త ఆవిష్కరణ ద్వారా చిన్న పిల్లల కోసం రూపొందించిన సురక్షితమైన, పర్యావరణ అనుకూలమైన దుస్తులు అందరినీ
ఆకట్టుకుంటున్నాయి. అందరికీ అవగాహన కల్పించేందుకు లక్ష్మీ కొండాల ‘ వేర్ థ ఛేంజ్ ‘ నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ను శంకరమఠం రోడ్ లో ఉన్న వీ హెల్త్ కేర్ లో వీ హెల్త్ కేర్ డైరెక్టర్ కె.ఎం.కె. రమేష్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మట్లాడారు. పసిపిల్లల లేలేత చర్మ ఆరోగ్యం కోసం అర్ఘానిక్ దుస్తులు దోహద పడతాయన్నారు. కార్యక్రమంలో నీత్ నేచురల్స్ – టైని కిడో సి.ఇ.ఒ. లక్ష్మి కొండాల తమ ఉత్పత్తుల గురించి వివరించారు. నవంబరు 10 వ తేదీన సిరిపురం చిల్డ్రన్ ఎరీనాలో కిడ్స్ ఫేషన్ షో నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి సంభందించి ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. పాఠశాల విధ్యార్థులకు, ఫేషన్ డిజైనర్లకు ఆర్ఘానిక్ దుస్తులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి సామ్స్ కిచెన్ ఇండియా, వీ హెల్త్ కేర్, డాన్స్ బ్రాడ్ వే అకాడమి, మన వైజాగ్, ఇలాహె మోడలింగ్ స్కూల్ సంస్థలు భాగస్వాములై సహకారం అందిస్తున్నాయని ఆమె తెలిపారు. ఆసక్తి కలిగినవారు 7995744495 నెంబరుకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు. వీ హెల్త్ కేర్ చీఫ్ మేనేజర్ చిన్నం కృష్ణ, డాక్టర్ ఇ . శ్రీ విద్య, డాక్టర్ తరుణ్ తేజ్, సి. హెచ్. పార్వతి తదితరులు పాల్గొన్నారు.
అందరికీ అవగాహన కల్పించేందుకు లక్ష్మీ కొండాల ‘ వేర్ థ ఛేంజ్ ‘ నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు#vvwnews
52