ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో అక్టోబర్6న విజయదశమి(దసరా) పర్వదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్టు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, నగర అధ్యక్షుడు పి.నారాయణ్ తెలిపారు. ఈ మేరకు గురువారం అక్కయ్యపాలెం వద్ద ప్రైవేట్ హెటల్‌లో మూడు యూనియన్ల కార్యవర్గాలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దసరా ఏర్పాట్లపై వీరంతా చర్చించారు. అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీనుబాబు, నారాయణన్‌లు వెల్లడించారు. 6వ తేది ఉదయం అల్పహారంతో దసరా సంబరాలు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం నగరానికి చెందిన వివిధ సంస్థల కళాకారులతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల కోసం లక్కీడిప్‌ను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం విందు భోజనంతో పాటు మిఠాయిల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు దసరా సంబరాల్లో పాల్గొని జయప్రదం చేయాలని వీరు కోరారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎ.సాంబశివరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.రవికుమార్, పితాని ప్రసాద్, బ్రాడ్‌కాస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరరావు, మధన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జగన్‌మోహన్, శ్రీనివాసరావుతో పాటు ఆయా కార్యవర్గాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరైయ్యారు.
ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్..#vvwnews
48