విశాఖ వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డే పల్లి రామచంద్రను #vvwnews

by vvwnews.com

విశాఖ వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డే పల్లి రామచంద్రను డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షులు బయ్యా మల్లయ్య, కార్యదర్శి ఎస్ మోహన్ బాబు ఉపాధ్యక్షులు దాసరి పుల్లారావు మోరి గణేష్ తదితరులు కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బంగా మల్లయ్య మాట్లాడుతూ విశాఖ వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డే పల్లి రామచంద్ర ను కలిసి ఆగస్టు 1న సుప్రీం కోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ పై క్రిమిలేయర్ పై ఇచ్చిన తీర్పు లో అంశాలు పై న్యాయపరమైన కొన్ని అంశాలను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని కోరామన్నారు. ఇటీవల 125 మంది బీజేపీ ఎంపి లు క్రిమిలేయర్, ఇతర అంశాలపై రివ్యూ చేయడానికి కేంద్రం రివ్యూ పిటిషన్ వేయాలని కోరారన్నారు అదే అంశాన్ని మరోసారి రామచంద్ర దృష్టి కి తీసుకొచ్చిమన్నారు. తీర్పులో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించాలని కోరడమైందన్నారు. అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డే పల్లి రామచంద్ర మాట్లాడుతూ ఎస్సీల పట్ల జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్, ప్రభుత్వ రంగ విభాగాల్లో , ప్రమోషన్లు, బ్యాక్ లాగ్ పోస్టులు, ఎంత వరకు అమలు అవుతున్నాయో, జిల్లా రివ్యూ లో సమీక్షించడం జరుగుతుందన్నారు.

మీడియా సమావేశంలో జాతీయ ఎస్సీ కమిషన్ వడ్డేపల్లి రామచందర్, డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు, పర్సనల్ సెక్రెటరీ క్రాంతి కుమార్, స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బయ్యే మల్లయ్య, బిజెపి ఉత్తరాంధ్ర మహిళ జోనల్ కన్వీనర్ పద్మ,ఎస్ మోహన్ బాబు పుల్లారావు గణేష్ తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles