కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ ను.. చిత్ర దర్శకుడు ఆర్.వి.వీ.సత్యనారాయణతో పాటు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ కలుసుకున్నారు. విశాఖ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రిని సిరిపురంలోని సర్క్యూట్ హౌస్ లో గురువారం కలిసిన సందర్భంగా బి.వి.రామ్ మాట్లాడుతూ.. ఇటీవల నిర్మించి విడుదలకు సిద్ధమైన మన్యం ధీరుడు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఈ సందర్బంగా మన్యం ధీరుడు చిత్రాన్ని ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో కేంద్ర మంత్రి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం కేంద్ర మంత్రివర్యులు మాట్లాడుతూ మన్యం ధీరుడు చిత్రం అద్భుతంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందే విధంగా చిత్రాన్ని నిర్మించారని దర్శకులు ఆర్.వి.వి. సత్యనారాయణ, తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ని అభినందించారు. చిత్రం కథనం, టేకింగ్, విజువల్స్ ప్రతి ఒక్కటి ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఉన్నాయన్నారు.ఈ చిత్రంలోని.. నమోస్తుతే భారతమాత పాటకు జాతీయ ఉత్తమ అవార్డు లభించే విధంగా తన వంతుగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆర్.వి.వి సత్యనారాయణ నటించి, దర్శకత్వం వహించిన మన్యం ధీరుడు ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రంలో భరతమాతను కీర్తిస్తూ చిత్ర దర్శకుడు హీరో ఆర్ వి వి సత్యనారాయణ స్వయంగా పాడిన “నమోస్తుతే.. భారతమాత” పాటకు జాతీయ అవార్డు ఇవ్వాలని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ కు బి.వి.రామ్ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ ను.. చిత్ర దర్శకుడు #vvwnews
47