విశాఖపట్నం చిన్న సినిమాలకు హబ్ గా మారుతుంది అని రంగ సాయి మీడియా అధినేత బాదం గీర్ సాయి పేర్కొన్నారు. సినీ పరిశ్రమ విశాఖకు వస్తుందని ఆ దిశగా తాము ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. మన్యం ధీరుడు సినిమా ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశామన్నారు. దాబాగర్డెన్స్ వీ జే ఎఫ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రైలర్ అద్భుతంగా ఉంది అన్నారు. వైజాగ్ చిన్న సినిమాలకు హబ్ గా మారబోతుందన్నారు. 1983 లో ప్రతిజ్ఞ సినిమా డిస్ట్రిబ్యూటర్ గా ప్రయాణం ప్రారంభించాం అన్నారు. సినిమా పరిశ్రమ విశాఖ రావడానికి కృషి చేస్తానన్నారు. సినిమా నిర్మాణం తో పాటు అల్లూరి సీతారామరాజు పాత్ర ధరించి, సినిమా తీయడం సాహసమే అన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా ని అందరూ ఆదరించాలన్నారు. మరిన్ని మంచి సినిమాలు సత్యనారాయణ నిర్దేశకత్వం లో రావాలని ఆశించారు. గత 38 ఏళ్లుగా కళా సేవ చేస్తున్నాం అన్నారు. చిరుత ఉత్తరాంధ్ర జిల్లాల్లో సినిమా విడుదల చేశాను అని గుర్తు చేశారు. ఈనెల 20 న సినిమా విడుదల అవుతుందన్నారు. విశాఖ వేంకటేశ్వర థియేటర్ లో ఈ సినిమా ప్రదర్శిస్తాము అన్నారు. ఈ తరం యువత ఈ సినిమా చూడాలి అని కోరారు.
విశాఖపట్నం చిన్న సినిమాలకు హబ్ గా మారుతుంది: రంగ సాయి మీడియా అధినేత #vvwnews
51