రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలగపూడిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చేసిన ప్రకటనలు,వాగ్దానాలు ఆచరణలో నిలబెట్టాలని విశాఖ జిల్లా అఖిలపక్ష, కార్మిక, ప్రజా సంఘాల జెఎసి డిమాండ్ చేసింది. బుధవారం జెఎసి ఆధ్వర్యంలో నేడు సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకర్లు సమావేశం నిర్వహించారు.
జేఏసీ ఛైర్మన్ ఎం. జగ్గునాయుడు, వైస్ ఛైర్మన్ బి. నాగభూషణం, కన్వినర్లు ఎన్. కనకారావు, ఎం.వెంకటేశ్వర్లు, దొమ్మేటి అప్పారావు, ఆర్.కెఎస్వి కుమార్ ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వాగ్దానాలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసారు. ఈసమావేశంలో జెఎసి నాయకులు జగ్గు నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి పోరాటాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వమన్నారు. ఇది రాష్ట్రానికి సెంటిమెంటు, కాపాడుకుంటామన్నారు. విశాఖ ప్రాంతం తెలుగుదేశం పార్టీ, ఎన్డీఎకి గట్టి కేంద్రమని స్టీల్ ప్లాంటును కాపాడుకోవడం మా బాధ్యత అని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనను జెఎసి స్వాగతిస్తున్నదన్నారు.
ప్రస్తుతం దేశంలో ప్రయివేటు స్టీల్ ప్లాంట్లు బాగున్నాయని,మంచి స్టీల్ ప్లాంటయిన వైజాగ్ స్టీల్ ఎందుకు నష్టాలు పాలవుతుందో ఆలోచించాలన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలగపూడిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చేసిన
50