ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నమెంట్#vvwnews

by vvwnews.com

ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నమెంట్(ఐపీఎల్ రేంజ్)కి క్రీడా కారుల నుంచి అనూహ్య స్పందన లభిచింది. విశాఖలోని తూర్పు నియోజవకర్గంలో 24 ఫ్రాంచైజీలు 400మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి. మంగళవారం విశాఖలోని ఆరిలోవ తోటగరువు రాధాక్రిష్ణ కళ్యాణ మండపంలో జరిగిన ఆడిషన్స్ అండ్ ఆక్షన్స్ అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఆక్షన్స్ ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు ఆదేశాల మేరకు మేనేజర్ సుధీర్ అండ్ టీమ్ చేపట్టారు. ఈ సందర్భంగా ట్రస్ట్ మేనేజన్ మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు మొత్తం 880 మందికి పైగా క్రీడాకారులు రిజిస్ట్రేషన్లు చేసుకోగా.. ఫ్రాంచైజీలు మాత్రం 400 మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ క్రికెట్ టోర్నీకి అనుకున్నదానికంటే అనూహ్య రీతిలో స్పందన లభించిందన్నారు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఆక్షన్స్ కి సమయం కేటాయించడంతో రాత్రి 8.30 గంటల వరకూ ఆక్షన్స్ జరిగాయన్నారు. ప్రస్తుతం సెలక్ట్ అయిన టీమ్ లకు ఉపకార్ ట్రస్టు నుంచి క్రికెట్ కిట్లను, క్రీడాకారులందరకీ టీషర్లు అందజేస్తామన్నారు. అక్టోబరు 3 నుంచి ఆరిలోవ పినాకిల్ గ్రౌండ్ లో క్రికెట్ లీగ్ ప్రారంభం అవుతుందన్నారు.

.

Use Social Media to Spread the Word about Our News

related articles