September 17, 2024

by vvwnews.com

*సెప్టెంబర్ 17 నాడు ప్రజావాణి పార్టీ ఫౌండర్ అండ్ నేషనల్ ప్రసిడెంట్ లింగిడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రజావాణి పార్టీ కేంద్ర కార్యాలయం సూర్యాపేట లో ఓటుకు నోటు వ్యతిరేక దినోత్సవo కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్బంగా పార్టీ జండాను ఎగురవేసి సూర్యాపేట పట్టణం లో బైకు ర్యాలీ నిర్వహించినారు. శ్రీ లింగిడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు కు నోట్లు, మద్యం పంచిపెడుతూ ప్రజాస్వామ్యాని అపహాస్యం చేస్తున్నారని, ఓటుకు నోట్లు, మద్యం పంచుతూ భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ను అవమానిస్తున్నారని లింగిడి అన్నారు. బ్యూరో కాట్లు భూస్వాములు ధనవంతులు ఓటుకు నోటు ఇచ్చి గాలానికి ఎ ర్ర ను గుచ్చి చేపలు పట్టినట్లు సన్యాసులు కొంతమంది ఓటుకు 500,1000,2000 ఇచ్చి అధికారం లోనికి వచ్చి ప్రజా సంపదను దోచుకుంటున్నారని లింగిడి అన్నారు. ఓటర్లు నోటుకు ఆశపడ కుండా సమర్థుడైనా మంచి అభ్యర్థికి ఓటు వెయ్యాలని అన్నారు. ప్రజావాణి పార్టీ న్యాయంగా, ధర్మంగా ఎన్నికల్లో పోటీచేసి గెలిచి ప్రజలను కాపాడుతుందని అన్నారు. కాంగ్రెస్, బి జే పి, బి ఆర్ ఎస్ పార్టీలు డబ్బును నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాయని,ఈ మూడు పార్టీలకు దమ్ముంటే ఓటర్లకు ఓట్లకోసం డబ్బులు,మద్యం పంచం అని ప్రమాణం చెయ్యాలని లింగిడి సవాలు చేశారు. ఓటుకు నోట్లు ఇచ్చినంత కాలం ప్రజలకు న్యాయం జరుగదని తెలిపారు. ప్రజావాణి పార్టీ అంటే న్యాయానికి ప్రతిరూపమని అందుకే ఓటుకు నోటు వ్యతిరేక దినోత్సా వం నిర్వహించినదని లింగిడి అన్నారు. ఈ కార్యక్రమం లో పార్టీ నేషనల్ సెక్రటరీ బి. మనోహర్ గుప్తా, కోలా సైదులు, యాస లింగారెడ్డి, ముండ్ల. గురువయ్య, శాగంటి నర్సయ్య, మున్నా మధుసూదన్, కొండా వేణు, సపావత్ వెంకన్న, జటంగి లింగయ్య,దూబని గురువమ్మ, కోట మల్లమ్మ,పోలేబోయిన వినోద తదితరులు పాల్గొన్నారు*

Use Social Media to Spread the Word about Our News

related articles