క్రెడాయ్ పదవ ప్రాపర్టీ షో నవంబర్ 29వ తేదీ శుక్రవారం నుంచి డిసెంబర్ 1వ తేదీ ఆదివారం వరకు ఎంవిపి కాలని అప్పుఘర్ రోడ్ గాదిరాజు ప్యాలెస్ లో ఘనంగా నిర్వహిస్తామని క్రెడాయ్ ప్రెసిడెంట్ వి.ధర్మేందర్ తెలిపారు. శనివారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖలో ఇంతవరకు తొమ్మిది క్రెడాయ్ షోలు విజయవంతంగా నిర్వహించా మన్నారు. దేశంలో రెండో అతి పెద్ద ఉపాది రంగం అయిన రియల్ ఎస్టేట్ వినియోగదారులు, వ్యాపారులకు వేదిక గా ఈ ఎక్స్పో నిలుస్తుం దన్నారు. చైర్మన్ కేఎస్ఆర్కే రాజు మాట్లాడుతూ వినియోగదారులకు వ్యాపారులకు వారధి గా నిలిచే ఈ ఎక్స్పో లో ప్రముఖ నిర్మాణరంగ సంస్థలన్నీ ఫాల్గొంటాయన్నారు. తమ సంస్థ సభ్యుల వద్ద కొనుగోలు చేసే ఫ్లాట్లు నాణ్యంగా వుంటాయని పేరు ప్రఖ్యాతులున్నా యన్నారు. విజయ వాడ వరద బాధితులకు తమ సంస్థ నగర శాఖ తరపున 10 లక్షలు, రాష్ట్ర శాఖ తరఫున 50 లక్షలు రూపాయలను విరాళంగా అందచేశా మన్నారు. ప్రజలకు తమ స్వంత ఇంటి కల నెరవేర్చడానికి ఈ ఎక్స్పో ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. విఎంఆర్డిఎ పరిధిలో మార్కెట్ లోకి వస్తున్న లే అవుట్ ల గురించి వినియోగ దారులకు పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. ఫ్లాట్లు, విల్లాలు తదితర ప్రాజెక్టుల గురించి కూడా సమగ్ర సమాచారం సందర్శకులకు అందుబాటులో ఉంచుతా మన్నారు. ఈ ప్రాపర్టీ షో సందర్శకులకు డ్రా ద్వారా పలు బహుమతులు అందచేస్తా మన్నారు. అనంతరం క్రెడాయ్ ఎక్స్పో బ్రోచర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ సభ్యులు, ఎస్బిఐ సిబ్బంది పాల్గొన్నారు.
క్రెడాయ్ పదవ ప్రాపర్టీ షో నవంబర్ 29వ తేదీ శుక్రవారం నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు..#vvwnews
53