మహిళా సాధికారత కోసం ఇటువంటి ప్రదర్శనలు అవసరమని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. నగరానికి చెందిన మహావీర్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో అక్కయ్యపాలెం ప్రియదర్శిని ఓల్టేజ్ హెూం పునర్నిర్మాణం, మహిళా సాధికారత కోసం దసరా ఉత్సవ్ పేరిట ఏర్పాటుచేసిన రెండు రోజుల ఎగ్జిబిషన్ కమ్ సేల్‌ని సిరిపురం లోని హుడా చిల్డ్రన్స్ ఎరినాలో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన గంటా శ్రీనివాసరావు శనివారం ఉదయం ప్రారంభించి ప్రదర్శనలో ఏర్పాటుచేసిన స్టాల్స్ లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో ఈ తరహా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. గృహణిలు ఖాళీగా ఉన్న సమయాల్లో వస్తువులను
తయారుచేసి, వాటిని ఈ విధంగా ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఎగ్జిబిషన్‌లోని అన్ని వస్తువులు నాణ్యతతో కూడుకున్నవని, ప్రతి ఒక్కరూ వీటిని కొని వారిని ప్రోత్సహించాలని కోరారు. తద్వారా వచ్చిన నగదును ఓల్డ్ ఏజ్ హెూమ్, మహిళా సాధికారత కోసం ఉపయోగించడం ఆనంద కరమన్నారు. మహావీర్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర చైర్ పర్సన్ సునీత మాట్లాడుతూ 60కి పైగా స్టాల్స్ ఉండే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రదర్శనలో వస్త్రాలు, కాస్మోటిక్స్ వస్తువులు, ఆభరణాలు, కేకులు, బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలను అమ్మకానికి ఉంచామన్నారు. రకరకాల బట్టలు, ఆకర్షణీయమైన ఆభరణాలు, కాస్మోటిక్ వస్తువులతో ఎగ్జిబిషన్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ లాల్ వాణి, సభ్యులు దివ్య, తదితరులు పాల్గొన్నారు.
మహిళా సాధికారత కోసం ఇటువంటి ప్రదర్శనలు అవసరమo..మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా
55