LIC……
ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ స్వర్ణోత్సవ వేడుకలు అక్టోబర్ 19, 20 వ తేదీలలో నిర్వహిస్తున్నామని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ విశాఖ డివిజన్ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ స్పష్టం చేశారు. గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఎన్ కృష్ణ మూర్తి, కన్వీనర్ గా వరప్రసాద్ వ్యవహరిస్తారని తెలిపారు. స్వర్ణోత్సవ వేడుకలకు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్. శ్రీకాంత్ మిశ్రా, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ వి. రమేష్, రాష్ట్ర నాయకులు, జోన్ నాయకులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ తదితరులు హాజరవ్వనున్నారని తెలిపారు. సమాజంలో నున్న లోటుపాట్లను సరిదిద్దుకొని, ఎల్ఐసి అభివృద్ధి కొరకు తోడ్పాటు అందిస్తామని, ఇన్సూరెన్స్ ప్రీమియం పైనున్న జీఎస్టీ ని తొలగించేందుకు అహర్నిశలు కృషి చేస్తామని, ఖాతాదారుల మేలు కోసం అన్ని విధాల పాటుపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ విశాఖ డివిజన్ అధ్యక్షులు కామేశ్వరి, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కే మోహన్ రావు, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ సెల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గణపతి రావు, ఇన్సూరెన్స్ కార్పొరేషన్
ఓబిసి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు డి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.