ప్రెస్ రిలీజ్.
తేది.12.9.2024.
ములుగు జిల్లా.
కోటి మందిమహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం::
మహిళా సంఘాలకు వడ్డీ లేని
రుణం మంజూరు.
మహిళా సంఘాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూ అండగా నిలబడుతుంది.
మహిళలకు 17 రకాల వ్యాపారాలకు ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం.
గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి తండాకు రోడ్డు కనెక్టివిటీ రహదారుల నిర్మాణం పనులు త్వరలో పూర్తి.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
పార్టీలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి చేసుకుందాం..
*****
రాష్ట్రంలోని కోటి మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు మహిళలు 17 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి,
గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ లతో కలిసి ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలోని ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఎస్ హెచ్ జి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ మహాలక్ష్మి మిల్క్ పార్లర్ , కోమలి డిజిటల్ స్టూడియో బుక్ స్టాల్ జిరాక్స్ ఇంటర్నెట్ సెట్ సెంటర్, సునిత ఎంబ్రాయిడరీ వర్క్స్, సారీ సెంటర్ , శ్రీ వెంకటేశ్వర కిరాణం జనరల్ స్టోర్ లను ప్రారంభించడంతో పాటు రాంసింగ్ తండా లో ఒక కోటి 10 లక్షల, శివ తండా లో ఒక కోటి 20 లక్షలతొ నిర్మించిన బిటి రోడ్లు, జాకారం గ్రామంలో 28.25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డైరీ ఫామ్ నుప్రారంభించారు. అనంతరం జాకరం గ్రామం లో 28.25 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పాల శీతలీకరణ కేంద్రం భవనాన్ని , ములుగు కేంద్రంలో 6 కొట్ల అంచనతో ములుగు- బుద్దారం రహదారిలో కి.మీ. 0/0 నుండి 1/0 (ములుగు పట్టణములో) వరకు 4 వరుసల రహదారి నిర్మాణ పనులను
ములుగు మండలం పులిగుండం గ్రామం లో పులిగుండం నుండి చింతకుంట వరకు 70 లక్షలతో నిర్మించిన బిటి రోడ్డును
జంగాలపల్లి – అంకన్న గూడెం రహదారి వెడల్పు చేయుట పనులను
ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి క్యాంట్లను మహిళా సంఘాల వారు ఏర్పాటు చేయడం కోసం రుణాలు మంజూరు చేసి ప్రారంభించడం జరిగిందని, జిల్లాలో 20 ఎకరాల స్థలంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి మహిళలు ఒక అప్పగించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను తీసుకుంటున్న మహిళలు సకాలంలో అప్పు చెల్లించాలని,
తిరిగి పెద్ద మొత్తంలో అప్పు కోరిన మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పలు రకాల వ్యాపారాలు చేసుకోవడానికి మహిళలకు డి ఆర్ డి ఏ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సూచనలు సలహాలు ఇవ్వాలని, మహిళలు బాగుంటేనే గ్రామాలు సమాజం బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
రాజకీయాలకు అతీతంగా ములుగు జిల్లాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి అన్ని పార్టీల నాయకులు ముందుకు రావాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారని అన్నారు.
ములుగు జిల్లాలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ , మెడికల్ కాలేజీ కూడా తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
ప్రతి ఒక్క మహిళ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మన ప్రాంతంలో ఎలాంటి బిజినెస్ పెడితే అందరికీ ఉపయోగపడుతుందో అలాంటి వాటిని ఎంచుకోవాలని సూచించారు.
భవిష్యత్తులో మల్లంపల్లి ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని రేపు రాబోయే కాలంలో యూనివర్సిటీ కూడా వస్తుందిని , డాక్టర్లు మెడికల్ స్టూడెంట్స్ అందరు కూడా 10 కిలోమీటర్ల పరిధిలోనే ఉండడం జరుగుతుంది కాబట్టి వారికి కావలసిన అవసరాలు మన ప్రాంతంలోనే సౌకర్యవంతంగా లభ్యమవుతాయని పేర్కొన్నారు.
జరగబోయే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మహిళలు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆన్నారు.
రాష్ట్రంలో పేదరిక నిర్మూలననే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని, ప్రభుత్వ కల్పిస్తున్న అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని కోరారు. ములుగు జిల్లాలో ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేయాలని ఉద్దేశంతో కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరుగుతుందని, రానున్న రోజులలో ములుగు జిల్లా కేంద్రంలో మంగపేట మండల కేంద్రంలో నూతన బస్టాండ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు. నూతనంగా చేపట్టిన పనులను నాణ్యత పూర్తి చేయాలని, నాసిరకంగా పనులు చేస్తే సంబంధిత కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లా కేంద్రంలో ఇప్పటికే గిరిజన యూనివర్సిటీ తరగతుల ప్రారంభం, మెడికల్ కళాశాల తరగతుల ప్రారంభం జరిగిందని, రానున్న రోజుల్లో నర్సింగ్ కళాశాల సైతం ఏర్పాటు కాబోతుందని అన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని, రామప్ప సరస్సు మధ్యలో ఐలాండ్ ఏర్పాటు చేసి పర్యాటకులు ఆకట్టుకునే విధంగా పనులు పూర్తి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావు, ఆర్డీఓ సత్య పాల్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్ అండ్ బి, పంచాయితి రాజ్ ఈఈలు,
సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.