పత్రికా ప్రకటన
విశాఖలో భారీ వర్షాల కారణంగా కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయండి.
– జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ .
విశాఖపట్నం, సెప్టెంబర్ 8: విశాఖ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నందున కొండవాలు ,లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు తక్షణమే చేపట్టాలని జీవీఎంసీ ఇంజనీరింగ్, ఉన్నతాధికారులకు విజయవాడ నుండి జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమీక్షలో కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే విశాఖలో 11 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, ఇంజనీర్లు ,అధికారులు తక్షణమే వార్డుల నందు, కొండవాలు, లోతట్టు, ముంపు గురైన ప్రాంతాల ను గుర్తించి పర్యటించాలన్నారు. కొండవాలు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ వారిని సమీపంలోనున్న సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. రోడ్లపై, వీధుల్లో చెట్లు విరిగిపడే అవకాశాలు ఉన్నందున వాటిని వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని , విద్యుత్ దీపాల మరమ్మతులను వెంటనే చేపట్టాలని అధికారులకు కమిషనర్ ఆదేశించారు. విజయవాడ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా గంట గంటకు సమీక్ష నిర్వహిస్తానని అధికారులు ఉద్యోగులు ఇంజనీర్లు అందుబాటులో ఉంటూ నగరంలో వర్షాలు కారణంగా సహాయక చర్యలో పాల్గొంటూ అందుబాటులో ఉండాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.కొండవాలు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ప్రమాదం జరిగేంత వరకు వేచి ఉండకుండా జీవీఎంసీ అధికారులు ఏర్పాటుచేసిన సురక్షితమైన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
పౌర సంబంధాల అధికారి ,
జీవీఎంసీ