బిజెపి ఏపీ రాష్ట్ర సంస్థగత సభ్యత్వ నమోదు కార్యక్రమ ప్రారంభోత్సవం #vvwnews #apbjp #visakhaupdates

by vvwnews.com

విశాఖ బిజెపి కార్యాలయంలో బిజెపి ఏపీ రాష్ట్ర సంస్థగత సభ్యత్వ నమోదు కార్యక్రమ ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో బొచ్చ సురేష్ కు, నీలాపు రమణారెడ్డి లకుపురందేశ్వరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొచ్చ సురేష్ మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావాలన్న సంకల్పంతో జాతీయ పార్టీ అయిన బిజెపిలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి సమక్షంలో జాయిన్ అవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన కుమారుడు బి బి ఏ విద్యార్థి బొచ్చ వేదవ్యాస్ తో పాటు సుమారు 1500 మంది వరకు తన తరఫున సభ్యత్వాన్ని చేయించినట్లు తెలియజేశారు. పార్టీలో అందరినీ కలుపుకొని పార్టీ అభ్యున్నతికి తన వంతు పూర్తి కృషి చేస్తానని సురేష్ చెప్పారు.

Use Social Media to Spread the Word about Our News

related articles