గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సుజాతను సస్పెండ్ చేస్తూ పాడేరు ఐటిడీపీఓ #vvwnews

by vvwnews.com

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలంలోని జాముగుడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సుజాతను సస్పెండ్ చేస్తూ పాడేరు ఐటిడీపీఓ అభిషేక్ ఉత్తర్వులు జారీ చేశారని ఏటిడబ్ల్యూ మల్లికార్జునరావు తెలిపారు.జాముగుడ ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 61 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురైన ఘటనపై హెచ్ఎంతోపాటు వార్డెన్ బాధ్యతలు నిర్వహిస్తున్న సుజాత నిర్లక్ష్యం ఉన్నట్లు అధికారుల విచారణలో తేలడంతోపాటు పీవో అభిషేక్ కూడా తన పరిధిలో అన్ని కోణాలలో పాఠశాల ఘటనపై వివరాలు సేకరించారని తెలిపారు.శుక్రవారం సాయంత్రం భోజనంలో ఉడికి అన్నం కుళ్ళిన గుడ్లు విద్యార్థులకు పెట్టడం ఇలాంటి అనేక నిర్లక్ష్యం కారణాల వలన హెచ్ఎం వార్డెన్ బాధ్యతలు నిర్వహించిన సుజాతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారించడం జరిగిందని ఏ ఏటీడబ్ల్యూ మల్లికార్జునరావు తెలియజేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles