మట్టి గణపతి బొమ్మ లు పూజించుదాం .- పర్యావరణ హితంగా జీవించుదాం #vvwnews

by vvwnews.com

మట్టి గణపతి బొమ్మ లు పూజించుదాం .
– పర్యావరణ హితంగా జీవించుదాం
– ఎకో వైజాగ్ ను విజయవంతం చేద్దాం
– నరవ ప్రకాశ రావు. వ్యవస్థాపక కార్యదర్శి. బాల వికాస ఫౌండేషన్

రాబోయే వినాయక చవితికి మట్టి గణపతి బొమ్మ లు పూజించుదాం అని బాల వికాస ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి నరవ ప్రకాశ రావు పిలుపునిచ్చారు.ఆదివారం ఉదయం ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్న బాల వికాస ఫౌండేషన్ బ్రిడ్జి స్కూల్లో బాల వికాస ఫౌండేషన్ స్వంచ్చంద సంస్థ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ సహకారం తో మట్టి తో వినాయక బొమ్మల తయారీ ఉచిత శిక్షణ వర్క్ షాప్ ను నిర్వహించ్చారు . ఈ సందర్భంగా నరవ ప్రకాశ రావు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్ తో ను, రసాయనాలతో, భారీ లోహాల రంగులతో ఉన్న గణపతి బొమ్మలు వాడకం హానికరం మని, వాతావరణాన్ని కలుషితం చేస్త్తాయని పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మట్టి తో ఉన్న గణపతి బొమ్మలు పూజించాలని హితవు పలికారు. ఈ అవగాహన విద్యుర్థులలో కలిగించాలని, బాలలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి రామేశ్వరి మాట్లాడుతూ పర్యావరణంతో మమేకమై జీవించాలని కోరారు. సమస్త జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిదె అని అన్నారు. సమస్త జీవరాశినీ కాపాడుకోడానికి మానవాళి నిరంతరం కృషి చేయకపోతే మానవాళి మనుగడకు ముప్పు ఏర్పడుతుంది అని వివరించారు.
.గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి జే.వి.రత్నం మాట్లాడుతూ జివిఎంసి కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం నగరంలో మట్టి వినాయక ప్రతిమలను విద్యార్థులు తో తయారు చేస్తున్నామన్నారు.
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ ప్రతినిధుల ఆద్వర్యంలో మట్టి తో గణపతి బొమ్మల తయారిలో మెలకవులు నేర్పించ్చారు . బాలబాలికలు అధిక సంఖ్యలో ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ కోఆర్డినేటర్ జెనపరెడ్డి రవితేజ, రాజేశ్వరి, సిద్దు, దీప్తి తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles