తోటవీధి గ్రామంలోని శ్రీ గంగాదేవి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం #vvwnews

by vvwnews.com

భీమునిపట్నం, తోటవీధి గ్రామంలోని శ్రీ గంగాదేవి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం తోటవీధి గ్రామ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. బుధవారం ఉదయం విగ్రహ ప్రతిష్ట, పూర్ణకలస ప్రతిష్ట, పూర్ణాహుతి హోమంతో అమ్మవారి ఆలయ ప్రారంబోత్సవం అంగరంగ వైభవంగా, విశేష జానవాహిని మధ్య అత్యంత దేద్విప్యమానంగా జరిగింది. ఈ సందర్బంగా భీమునిపట్నం మాజీ కౌన్సిలర్ సురకల రమణ మాట్లాడుతూ తరతరాలుగా మత్స్యకారులకు ఏ కష్టం వచ్చిన కన్నతల్లిలా కాపాడుకుంటూ వస్తున్న గంగమ్మ తల్లి ఆలయం నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందని, అలాగే గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విశేష కృషి చేసిన తోటవీధి గ్రామ ప్రజలకు, ఆలయ నిర్మాణానికి సహాయం అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ప్రతి ఒక్క మత్స్యకారుడు ఈ తల్లిని స్మరించుకుంటూ వేటకు వెళ్లినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జరుగుతుంది అని, గంగమ్మ తల్లి అనుగ్రహం వల్ల మత్స్యకారుల జీవితాలు సుఖ, సంపదలతో జీవనం కొనసాగిస్తన్నారని అన్నారు, కార్యక్రమం అనంతరం సుమారు 2వేల మందికి భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

Use Social Media to Spread the Word about Our News

related articles