బియ్యం పిండి తో ముగ్గులు వేసి ఆరోగ్యంగా జీవించండి #vvwnews #visakhaupdates

by vvwnews.com

బియ్యం పిండి తో ముగ్గులు వేసి ఆరోగ్యంగా జీవించండి
– చీమలు, పిచ్చుకలకు ఆహారంగా ఉపయోగపడేది బియ్యం పిండి
– భూమికీ, భూగర్భ జలాలకూ హాని కలిగించే గేస్, రంగు రంగుల ముగ్గు వద్దే వద్దు.

బియ్యం పిండి తో ముగ్గులు వేసి ఆరోగ్యంగా జీవించండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం మురళీ నగర్ లోని హరిత వాకర్స్ పార్క్ లో సిటిజి, వనమాలి గార్డనర్స్ గ్రూప్ బియ్యం పిండి తో ముగ్గులు పోటీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్యాస్ ముగ్గు, రసాయనాలతో కూడిన రంగుల ముగ్గులు వినియోగించడం వల్ల భూమి, భూగర్భ జలాలు నాశనం అవుతాయి అన్నారు. చాలా రకాల జీవులకు నష్టం కలుగుతుందని వివరించారు. అనాదిగా బియ్యం పిండి తో ముగ్గులు వేయడం మన ఆచారం అని, అదే ఆరోగ్యకరమైన విధానమని ఆయన పేర్కొన్నారు. బియ్యం పిండి తో ముగ్గులు వేయాలనే ప్రచారం విస్తృతంగా నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బహుమతులు ప్రదానం హరిత వాకర్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి లు కొండలరావు, దేవుడు బాబు నిర్వహించారు.
ప్రధమ బహుమతి అన్నపూర్ణ, ద్వితీయ బహుమతి దీపాశిఖ, తృతీయ బహుమతి ఎ. లక్ష్మి, కన్సోలేషన్ బహుమతులు లక్ష్మి కుమారి, మాధవి సాధించారు. బహుమతులు మురళీ నగర్ లోని ఎస్ ఎస్ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు స్పాన్సర్ చేశారు.
ఈ పోటీకి జడ్జిలుగా మహిళా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లలితా రెడ్డి, వనితా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభావతి, గౌరీ సంఘం ప్రెసిడెంట్ ఝాన్సీ లు వ్యవహరించారు.
ఈ కార్యక్రమాన్ని సిటిజి, వనమాలి ప్రతినిధులు అరవల అరుణ, మళ్ళ సరిత, నాదెళ్ల జ్యోతి, రామా దేవి తదితరులు నిర్వహించారు.
కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వాలంటీర్లు జెనపరెడ్డి రవితేజ ఇళ్ళ కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles