విశాఖలో జరుగుతున్న AITUC జాతీయ సమితి సమావేశాలు జయప్రదం చేయాలి 25-8-2024

by vvwnews.com

ప్రెస్ నోట్ కార్మికుల జీవించే హక్కు పై పోరాడండి జి వామనమూర్తి పిలుపు సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తారీకుల్లో విశాఖలో జరుగుతున్న ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలను జయప్రదం చేయాలని కోరుతూ తేదీ 25 824 ఉదయం 10 గంటలకి కె ఆర్ ఎం కాలనీలో ప్రచార కార్యక్రమం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సంయుక్తం చేసేందుకు సెప్టెంబరు ఒకటి రెండు మూడు తారీకుల్లో విశాఖలో జరిగే ఏఐటియుసి జాతీయ సమితి సమావేశాలను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు బడా కార్పొరేట్ సంస్థలకు అమ్మ కాలికి పెట్టి దేశాన్ని అన్ని విధాలుగా దివాలా దీస్తుందని మండిపడ్డారు ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షణకై కార్మిక వర్గం పోరాడాలని పిలుపునిచ్చారు విశాఖ జిల్లాలో ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి యువకులు ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లేదని అన్నారు ప్రభుత్వం ప్రైవేటు పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టదీట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో కార్మిక ఆగ్రహానికి ప్రభుత్వం తగిన చెల్లించక తప్పదని హెచ్చరించారు సెప్టెంబర్ మూడో తేదీన విశాఖ సరస్వతి పార్క్ నుండి జీవీఎంసీ గాంధీ బొమ్మ వరకు జరుగు కార్మిక మహాప్రదర్శనలో కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలని పిలుపునిచ్చారు ఈ ప్రచార కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు రావి కృష్ణ కే మోహన్ పి రాము ఆర్ జగన్నాథం ఈ నరేష్ ఆర్ అప్పారావు కే నాగరాజు జి రాము తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles