వైఎస్ఆర్సిపి పార్టీ అచ్చుతా పురం ఫార్మా సిటీలో సంఘటనపై స్పందించి ప్రతి ఒక్కరికి 5లక్షలు ప్రకటించారు

by vvwnews.com

శవ రాజకీయాలు చేస్తున్నది కూటమే

– ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ

లా సన్స్ బే కాలనీ (విశాఖ తూర్పు):

శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం
లాసెన్స్ బే కాలనీ, కామత్ రెస్టారెంట్ ప్రక్కనగల
బొత్స సత్యనారాయణ (శాసనమండలి ప్రతిపక్ష నాయకులు) క్యాంప్ కార్యాలయం లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్మా సిటీ కంపనీ దుర్ఘటనలో 17 మంది చనిపోగా, 38 మందికి గాయాలు అయ్యాయి అన్నారు. ఇది చాలా బాధాకరం అన్నారు. వైసిపి అధ్యక్షుడు, మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి బాధితులకు పరామర్శ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి, వెళ్ళారు అన్నారు. ఆయన ఆదేశాలు మేరకే మృతుల కుటుంబాలకు రు.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాము అని చెప్పారు. గాయ పడిన వారికి రూ లక్ష వంతున సాయం చేస్తాం అన్నారు. పరిశ్రమలకు వ్యతిరేకం కాదు అని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ హయంలోనే ఫార్మా సిటీ వచ్చింది అని గుర్తు చేశారు. తరువాతి ప్రభుత్వాలు ఫార్మా సిటీ ప్రమాదాల నివారణ మీద దృష్టి సారించాలి అని కోరారు. ఘటన జరిగిన రోజు రాత్రి కూటమి నేతలు, మంత్రి, ఎమ్మెల్యేలు రాక పోవడం అన్యాయం అన్నారు. బాధిత కుటుంబీకులు టీవీలో వార్తలు చూసి వచ్చాం అని సాక్షాత్తు సిఎం చంద్ర బాబు నాయుడు వద్ద చెప్పారు అన్నారు. ఎల్ జి పాలీమర్స్ ఘటన రోజూ వై సి పి శ్రేణులు చేరుకున్నాం అన్నారు. అది మానవత్వం, బాధ్యత అన్నారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాల్సింది పోయి, రాజకీయం చేయడం అవివేకం అన్నారు. వైసిపి డిమాండ్ తరువాతనే ప్రభుత్వం కోటి పరిహారం ప్రకటించారు అని పేర్కొన్నారు. ఘటన రోజే మాజీ ఎమ్మేల్యే కన్న బాబు బాధితులను పరామర్శించారు అన్నారు. జిల్లా యంత్రాంగం ద్వారా కాల్ సెంటర్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు ఏది అని ప్రశ్నించారు. ప్రభుత్వం రెండు రకాలుగా స్పందించడంతో బాధితులకు అప నమ్మకం కలుగుతుంది అన్నారు. హత్యా రాజకీయాలు ఆపండి అని హితవు పలికారు. వైసిపి ప్రభుత్వం హయాంలో సేఫ్టీ ఆడిట్ కోసం 2021 లోనే ఆదేశాలు ఇచ్చాం అన్నారు. ఫ్యాక్టరీల శాఖ అధికారులు తనిఖీలు చెయ్యాల్సిందే అని స్పష్టం చేశారు.
మీడియా సమావేశంలో వై యస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు కన్న బాబు, గుడి వాడ అమర్నాథ్, కరణం ధర్మ శ్రీ, రవి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles